iDreamPost
android-app
ios-app

కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • Published Dec 07, 2023 | 6:37 PM Updated Updated Dec 07, 2023 | 6:45 PM

డిఫరెంట్ జోనర్లను ఎంచుకుంటూ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం డెవిల్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్.

డిఫరెంట్ జోనర్లను ఎంచుకుంటూ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం డెవిల్. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్.

  • Published Dec 07, 2023 | 6:37 PMUpdated Dec 07, 2023 | 6:45 PM
కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

కొత్తగా ఏదైనా చేయాలనుకునే యంగ్ హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ పేరే మొదట చెప్పాలి. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార. ఎవ్వరూ అంగీకరించని కథని భుజాలకెత్తుకుని తిరుగులేని హిట్ కొట్టాడు. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వశిష్ట ఏకంగా మెగాస్టార్ సినిమాకే దర్శకుడిగా ఎదిగాడు. దీని వెనుక నందమూరి కళ్యాణ్ రామ్ సాహసమే ఎక్కువ. సురేందర్ రెడ్డి తొలి చిత్రం అతనొక్కడే కూడా కళ్యాణ్ రామ్ ఎన్నో అవాంతరాలను అధిగమించి నిర్మించి హిట్ కొట్టి చూపించాడు. తర్వాత అనిల్ రావిపూడి ఫస్ట్ పిక్చర్ ఫటాస్ స్క్రిప్టు కూడా ఎందరో విన్నారు గానీ, చెయ్యడానికి ఎవ్వరూ పూనుకోలేదు. దాన్ని కూడా ఎంకరేజ్ చేసింది కళ్యాణ్ రామే. అనిల్ రావిపూడికి అది ట్రేడ్ పరంగా గానీ, ప్రేక్షకులలో గానీ గొప్ప పేరు తెచ్చిన చిత్రంగా నిలబడింది. ఇదీ నందమూరి కళ్యాణ్ రామ్ వరస.

ఇప్పుడు తనిప్పటివరకూ చేయని జోనర్లో అబిషేక్ నామా స్వీయదర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించిన డెవిల్ చిత్రంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా విభిన్నమైన రోల్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. అదీ భారీ బడ్జెట్ తో. పీరియాడిక్ స్పై ధ్రిల్లర్ గా వస్తున్న డెవిల్ చిత్రం భారీ అంచనాల నేపథ్యంలో డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేస్తున్నారు. ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేధించే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.

kalyan ram devil release date anouncement

డెవిల్ అనే టైటిల్ కి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో హీరో పాత్ర తీరుతెన్నులు, డెవిల్ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ సెట్ అయిన విధానానికి వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ రాబోతున్న పండగ విడుదల తేదీ ప్రకటించగానే ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో హీరోయిన్ గా ట్రెండింగ్ లో ఉన్న సంయుక్తా మీనన్ చేయడం డెవిల్ సినిమాకి మరికొంత అట్రాక్షన్ వచ్చింది. సంయుక్తా మీనన్ లుక్ కూడా బాగా ఎక్సైట్ చేస్తోంది. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా అభిషేక్ నామా పగ్గాలు పట్టుకున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు.

                                                                                                                                                                                                                -నాగేంద్ర కుమార్     

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş