iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న నంద‌మూరి హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 05, 2024 | 12:14 PM Updated Updated Mar 05, 2024 | 12:14 PM

Nandamuri Hero Movie Coming to OTT: ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసే అవకాశం లభిస్తుంది. ధియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

Nandamuri Hero Movie Coming to OTT: ఓటీటీ పుణ్యమా అని కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు చూసే అవకాశం లభిస్తుంది. ధియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి.

  • Published Mar 05, 2024 | 12:14 PMUpdated Mar 05, 2024 | 12:14 PM
ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న నంద‌మూరి హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఒకప్పుడు ధియేటర్లలో పడిగాపులు కాసి టికెట్ తీసుకొని సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ధియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇండియన్ మూవీస్ మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ ప్రతి వారం పదుల సంఖ్యల్లో సందడి చేస్తున్నాయి.  లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఓటీటీల్లోనే సినిమాలు చూశారు.. అదే ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఆడియన్స్ ఎక్కువగా కామెడీ, హర్రర్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ లో వస్తున్న మూవీస్, వెబ్ సీరీస్ చూస్తు ఎంజాయ్ చేన్నారు. తాజాగా నందమూరి హీరో నటించిన ‘బ్రీత్’ ఓటీటీలోకి రాబోతుంది. స్ట్రీమింగ్ ఎక్కడ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఆయన తర్వాత ఎన్టీఆర్, తారక్, కళ్యాన్ రామ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరి బాటలోనే నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల చైతన్య కృష్ణ నటించిన ‘బ్రీత్’ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వైదిక సెంజలియా హీరోయిన్ గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ధియేటర్లలో రిలీజ్ అయిన బ్రీత్ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అంతేకాదు సినిమాపై ఏమాత్రం బజ్ లేకపోవడం, ప్రమోషన్స్ లేకపోవడంతో భారీ డిజస్టర్ గా నిలిచింది. దాదాపు 4 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లోనే అత్యంత దారుణమైన కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్.

ఈ చిత్రం దాదాపు మూడు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి బ్రీత్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది ఆహా. సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇక కథ విషయానికి వస్తే.. రాష్ట్ర సీఎం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. సీఎం ని చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో ఓ సాధారణ యువకుడు సీఎం ని ఎలా కాపాడుతాడు.. అసలు ఆ యువకుడు ఎవరు? అతనికి సీఎం కి ఉన్న సంబంధం ఏంటీ అన్నదే బ్రీత్ కథ. మెడికో థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించాడు. కానీ అనుకున్న స్థాయిలో ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet