iDreamPost
android-app
ios-app

స్వర్గీయ నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

  • Published May 30, 2024 | 3:35 PM Updated Updated May 30, 2024 | 3:35 PM

Nandamuri Family: సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రెటీలు అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు, స్వీట్ మెమొరీస్ అభిమానులకు షేర్ చేస్తున్నారు.

Nandamuri Family: సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రెటీలు అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలు, స్వీట్ మెమొరీస్ అభిమానులకు షేర్ చేస్తున్నారు.

  • Published May 30, 2024 | 3:35 PMUpdated May 30, 2024 | 3:35 PM
స్వర్గీయ నందమూరి తారక రామారావు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి నటసార్వ భౌముడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఆయన వారసుడిగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే హరికృష్ణ.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాగానే ఆయన వెంటే ఉన్నారు. బాలకృష్ణ మాస్ హీరోగా ఎదిగారు..ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యారామ్‌లు హీరోలుగా రాణిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి దివంగత తారకరత్న నటుడిగా మంచి పేరు తెచ్చుకునే సమయానికి హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తాజాగా నందమూరి ఎన్టీఆర్‌లో ఆ కుర్రాడి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. వీరి బాటలోనే మరో హీరో ‘బ్రీత్ ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా? ఆయన పేరు నందమూరి చైతన్యకృష్ణ. దివంగత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ తయుడు ఈ చైతన్యకృష్ణ. ప్రస్తుతం ఈ హీరో పేరుసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 2న ‘బ్రీత్’ రిలీజ్ అయ్యింది.. ఒక్క పైసా కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. మెడికల్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో చైతన్య కృష్ణ ఆకట్టుకోలేకపోయాడని టాక్ వినిపించింది.

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ. సినిమాలపై ఉన్న ప్రేమతో నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2003 లో జగపతిబాబు హీరోగా నటించిన ‘ధమ్’ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత అవకాశలే పెద్దగా రాలేదు. చాలా సంవత్సరాలు వేయిట్ చేసిన చైతన్యకృష్ణ నటనపై ఆసక్తి తగ్గక ‘బ్రీత్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. సినిమాలే కాదు.. చైతన్య కృష్ణ రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో తన బాబాయి బాలకృష్ణ, మామ చంద్రబాబు, టీడీపీ పార్టీ గురించి మాట్లాడుతూ హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ తో జయకృష్ణ దిగిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet