iDreamPost
android-app
ios-app

Jr NTR ఫ్యాన్స్‌కు నందమూరి కృష్ణ చైతన్య వార్నింగ్‌.. బూతులు తిడుతూ

  • Published May 22, 2024 | 9:12 AM Updated Updated May 22, 2024 | 9:12 AM

నందమూరి కృష్ణ చైతన్య.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. ఆ వివరాలు..

నందమూరి కృష్ణ చైతన్య.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతుంది. ఆ వివరాలు..

  • Published May 22, 2024 | 9:12 AMUpdated May 22, 2024 | 9:12 AM
Jr NTR ఫ్యాన్స్‌కు నందమూరి కృష్ణ చైతన్య వార్నింగ్‌.. బూతులు తిడుతూ

నందమూరి హీరో కృష్ణ చైతన్య.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులుకు మాస్‌ వార్నింగ్‌ ఇస్తూ.. సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బూతులు తిడుతూ చేసిన ఈ పోస్ట్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌ జరుగుతుంది. అసలేం.. జరిగింది.. ఎందుకు కృష్ణ చైతన్య వార్నింగ్‌ ఇచ్చాడు.. ఏం పోస్ట్‌ చేశాడో ఇప్పుడు చూద్దాం. తాజాగా నందమూరి కృష్ణ చైతన్య.. ఫేస్‌బుక్‌ వేదికగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు మాస్‌ వార్నింగ్‌ ఇస్తూ ఓ పోస్ట్‌ చేశాడు. బూతులు కూడా వాడాడు. దీనిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులందరకి నా వార్నింగ్‌ ఇదే.. వైఎస్సార్‌సీపీ నేతలు కొండాలి నాని, వల్లభనేని వంశీ, మీరు సపోర్ట్ చేశారు అని అంటారు. కానీ మీరు ఎవరు సపోర్ట్ చేయడానికి, బొచ్చు కూడా పీకలేరు.. నేను ఉండగా మావయ్య చంద్రబాబు, బాబాయ్‌ బాలకృష్ణని ఎవరూ ఏం చేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన సినిమా రిలీజ్ సమయంలో జూనియర్ ఫ్యాన్స్, వైఎస్సార్ సీపీ వాళ్లు కల్పించుకుని తనను బాగా ట్రోల్ చేశారని, జాగ్రత్త గా ఉండాలంటూ కృష్ణ చైతన్య వార్నింగ్‌ ఇచ్చాడు. దీనిపై ఓ రేంజ్‌లో కామెంట్స్‌ వస్తున్నాయి. ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది బ్రో..అసలు నీ ఫెస్ కి సినిమాలు యాక్టింగ్ లాంటివి సెట్ కావు ఇంకో మాట జూనియర్‌ ఎన్టీఆర్‌ గారిని అనే అంత గొప్ప వాడివి నువ్వు కావు అన్ని మూసుకుని అంటూ ఘాటుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

అదలా ఉంచితే సినిమాల వియానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర పార్ట్‌ 1 కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నాడు. దాంతో పాటు ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో ఓ యాక్షన్ మూవీ ప్లాన్ చేశారు. ఆగ‌స్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరో కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగి పోతున్నాయి. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో వీరి కాంబోలో మూవీ వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఫైన‌ల్ చేస్తున్నారు. అలానే బాలీవుడ్‌లో వార్‌ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş