ఒకే నెలలో తండ్రి కొడుకుల సినిమాలు.. ?

ప్రస్తుతం నాగచైతన్య అటు పెళ్లి పనులతో పాటు.. తండేల్ సినిమా రిలీజ్ పనులలోను బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా నాగార్జున మూవీ కూడా అదే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య అటు పెళ్లి పనులతో పాటు.. తండేల్ సినిమా రిలీజ్ పనులలోను బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా నాగార్జున మూవీ కూడా అదే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీరి పెళ్లి తేదీ , వెన్యూ అన్ని ఫిక్స్ అయ్యాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇక నాగచైతన్య అటు పెళ్లి పనులతో పాటు తన సినిమా పనులలోను బిజీ బిజీగా ఉన్నాడు. నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ తండేల్. ఈ సినిమాపై అందరికి ఆశలు ,అంచనాలు పెరిగాయి. దానికి తోడు బ్యాక్డ్రాప్ చాలా కొత్తగా అనిపిస్తుంది. దీనితో ఈ సినిమాపై నమ్మకాలూ మరింత పెరిగాయి. ముందు జనవరిలోనే ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. కానీ ఇప్పుడు అది ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. మొదట అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ పోటీలో రావడం కంటే సోలోగా రావడం బెటర్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దాదాపు ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లే. ఫిబ్రవరి 7 న ఈ సినిమా థియేటర్లో అడుగుపెట్టబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

అయితే ఇప్పుడు చైతన్య కు పోటీగా ఫిబ్రవరిలో నాగార్జున రాబోతున్నాడు. నాగార్జున కుభేర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ధనుష్ అయినప్పటికి.. నాగార్జున మీద  అందరికి ఫోకస్ ఉంది. దీనితో ఈ సినిమాకు మల్టీస్టారర్ లుక్ వచ్చేసింది. లీడర్ సినిమా తర్వాత ఓ సీరియస్ సబ్జెక్టు తో శేఖర్ కమ్ముల వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా కూడా ఫిబ్రవరి నెలలోనే రానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14 లేదా 21 న రిలీజ్ చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయట. కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు. ఒకవేళ వారం వ్యవధిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే మాత్రం తండేల్ కు కాస్త కలెక్షన్స్ తగ్గే అవకాశం లేకపోలేదు. కానీ కుభేర సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయిందని సమాచారం. దీనిపై భారీ బడ్జెట్ నే పెట్టారు మేకర్స్.

ఊహించని ట్విస్ట్ లతో శేఖర్ కమ్ముల ఈ సినిమాను డిసైన్ చేశాడట. కాబట్టి ఈ సినిమా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు. ఒకవేళ ఆ తర్వాత నెలలో రిలీజ్ చేద్దాం అనుకున్నా కానీ.. అప్పటికి తమ్ముడు, హరిహర వీరమల్లు, ఎల్ 2 ఎంపూరన్ లాంటి సినిమాలు రెడీ గా ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసినా తండ్రి కొడుకుల మధ్య వార్ తప్పేలా లేదు. ఒకవేళ రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే కనుక.. కలెక్షన్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. రెండు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి దాదాపు పాజిటివ్ టాక్ సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల మీద డీసెంట్ హైప్ కొనసాగుతుంది. ఒక్కసారి వీటి నుంచి ఏదైనా అప్డేట్స్ వస్తే అప్పుడు ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. ఈ సినిమాల రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి.. పక్కా ప్లానింగ్ తో అప్డేట్స్ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments