iDreamPost
android-app
ios-app

Naga Chaitanya: N కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్‌ ఇదే

  • Published Aug 28, 2024 | 8:22 AM Updated Updated Aug 28, 2024 | 8:23 AM

Naga Chaitanya-N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగచైతన్య స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Naga Chaitanya-N Convention Demolition: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగచైతన్య స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Aug 28, 2024 | 8:22 AMUpdated Aug 28, 2024 | 8:23 AM
Naga Chaitanya: N కన్వెన్షన్‌ కూల్చివేతపై నాగ చైతన్య రియాక్షన్‌ ఇదే

హైడ్రా.. నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు మార్మోగిపోతుంది. హైదరాబాద్‌లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత రాష్ట్రంలో సంచలనంగా మారింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌ను ఇటీవల హైడ్రా బృందం కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కినేని నాగార్జున.. హైకోర్టుకు కూడా వెళ్లారు. ఈఘటనతో హైడ్రా పేరు మార్మోగిపోయింది. ఇక తాజాగా దీనిపై నాగార్జున కుమారుడు.. నాగ చైతన్య స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తాజాగా నాగ చైతన్య.. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై ప్రశ్నలు సంధించారు.  దీనికి నాగచైతన్య బదులిస్తూ.. ఆ విషయం ఇప్పుడు వద్దని, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి నాన్న ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో అన్ని వివరాలు వెల్లడించారు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత శోభిత గురించి, వారి వివాహం గురించి ప్రశ్నించగా.. వాటికి బదులిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  డెస్టినేషన్‌ లేదా హైదరాబాద్‌లోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నించినప్పుడు ఇంకా ఏం నిర్ణయించుకోలేదన్నారు నాగ చైతన్య.

తమ పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో త్వరలోనే అందరికి అన్నీ వివరాలు తెలుస్తాయని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. సోషల్‌ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగినపుడు అలా ఏం లేదని, తనను ఎక్కువ చూపించడం వల్ల అలా అనిపిస్తుందని చెప్పారు. ఇక తన సినిమా తండేల్‌ గురించి ప్రశ్న ఎదురుకాగా, తన ప్రస్తుత లుక్‌ తండేల్‌ కోసమేనన్నారు. ఇప్పటి వరకు తను చేసిన సినిమాలతో పోలిస్తే తండేల్‌ పాత్ర అత్యంత సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఇది రియల్‌ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అని చెప్పుకొచ్చారు.

మరోవైపు నటి శోభితా ధూళిపాళ, నాగచైతన్యకు ఈ నెల 8న నిశ్చితార్థం జరిగింది. శోభిత, చైతన్య ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారి మనసులు కలిశాయి. ఇక సినిమాల విషయానికి వస్తే చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş