iDreamPost
android-app
ios-app

నాగ చైతన్య ‘దూత’ వెబ్‌సిరీస్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌!

  • Published Nov 01, 2023 | 8:41 AM Updated Updated Nov 01, 2023 | 12:06 PM

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఎలాంటి ముహమాటం లేకుండా వెబ్‌ సిరీసుల్లో నటిస్తున్నారు. సౌత్‌లో మాత్రం.. వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న స్టార్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఎలాంటి ముహమాటం లేకుండా వెబ్‌ సిరీసుల్లో నటిస్తున్నారు. సౌత్‌లో మాత్రం.. వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న స్టార్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

  • Published Nov 01, 2023 | 8:41 AMUpdated Nov 01, 2023 | 12:06 PM
నాగ చైతన్య ‘దూత’ వెబ్‌సిరీస్‌ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌!

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీల వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీకి వచ్చేస్తుంటే.. మరికొన్ని సినిమా థియేటర్లలో ఆడిన తర్వాత వస్తున్నాయి. సినిమా తారలు కూడా నేరుగా ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు తీయటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. సౌత్‌తో పోల్చుకుంటే నార్త్‌లో వెబ్‌ సిరీస్‌ల హావా బాగా నడుస్తోంది.

స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఎలాంటి ముహమాటం లేకుండా వెబ్‌ సిరీసుల్లో నటిస్తున్నారు. సౌత్‌లో మాత్రం.. వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న స్టార్‌ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. హీరోయిన్‌ సమంత ‘ సిటడెల్‌’ అనే వెబ్‌ సిరీస్లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, నాగ చైతన్య కూడా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన దూత అనే వెబ్‌ సిరీస్‌ నటించారు. ఇది ఆయన మొదటి వెబ్‌ సిరీస్‌ కావటం విశేషం. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

తాజాగా, దూత స్ట్రీమింగ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ అయింది. అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా వెబ్‌ సిరీస్‌ ఉండనుందట. ఒక్కో ఎపిసోడ్‌ 40 నిమిషాల నిడివి ఉండనుందట. ఇక, ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌ దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించినట్లు సమాచారం. మరి, నాగ చైతన్య నటించిన ‘దూత’ వెబ్‌ సిరీస్‌ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom