iDreamPost
android-app
ios-app

Thandel: బుజ్జి తల్లీ వచ్చేత్తన్నా.. ఎమోషనల్‌గా ‘తండేల్‌’ గ్లింప్స్‌!

  • Published Jan 06, 2024 | 12:55 PM Updated Updated Jan 06, 2024 | 12:55 PM

తండేల్‌ సినిమా నుంచి శనివారం గ్లింప్స్‌ వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. గ్లింప్స్‌లోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి.

తండేల్‌ సినిమా నుంచి శనివారం గ్లింప్స్‌ వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల్లోనే లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. గ్లింప్స్‌లోని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి.

  • Published Jan 06, 2024 | 12:55 PMUpdated Jan 06, 2024 | 12:55 PM
Thandel: బుజ్జి తల్లీ వచ్చేత్తన్నా.. ఎమోషనల్‌గా ‘తండేల్‌’ గ్లింప్స్‌!

యువ సామ్రాట్‌ నాగ చైతన్య హీరోగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో తండేల్‌ ఉండనుంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా, తండేల్‌ ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియో విడుదల అయింది. శనివారం ఉదయం యూట్యూబ్‌లోకి వచ్చిన ‘ తండేల్‌’ గ్లింప్స్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లింది. 2 నిమిషాల 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చాలా ఎమోషనల్‌గా ఉంది.

లవ్‌ స్టోరీ ప్రధానంగా ‘తండేల్‌’ ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో కథను చెప్పీ చెప్పకుండా చెప్పాడు దర్శకుడు చందు మొండేటి. సముద్రంలో చేపలు పట్టుకునే వ్యక్తి.. బుజ్జితో అనే అమ్మాయితో ప్రేమ. తర్వాత అనుకోని విధంగా పాకిస్తాన్‌లో చిక్కుకు పోవటం మెయిన్‌ కథగా తెలుస్తోంది. పాకిస్తాన్‌లో చిక్కుకున్న వాళ్లు ఎలా దేశానికి వచ్చారు? అసలు దేశానికి తిరిగి వచ్చారా? లేదా? హీరో తన ప్రియురాలు బుజ్జిని తిరిగి కలిశాడా? లేదా అన్నదే మిగిలిన కథగా తెలుస్తోంది.

thandel glimpse review

‘‘ దద్ద గుర్తెట్టుకో.. ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్‌.. ఇక, రాజులమ్మ జాతరే.. ’’..‘‘ మా నుండి ఊడిపోన ఓ ముక్క మీకే అంతుంటే.. ఆ ముక్కను ముస్టేసిన మాకెంత ఉండాలి.. తేరే బాప్‌.. పాకీస్తానీ అడ్డామే బైట్‌కే బతారహాహూ.. భారత్‌ మాతీకీ జై’’.. అన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఈ సినిమా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరి, తండేల్‌ గ్లింప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet