iDreamPost
android-app
ios-app

Priyadarshi: హీరో ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్.. మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ

  • Published Apr 18, 2024 | 7:46 AM Updated Updated Apr 18, 2024 | 7:54 AM

హీరో, నటుడు ప్రియదర్శికి.. టాలీవుడ్ హీరోయిన్ ఒకరు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన వార్నింగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

హీరో, నటుడు ప్రియదర్శికి.. టాలీవుడ్ హీరోయిన్ ఒకరు సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన వార్నింగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

  • Published Apr 18, 2024 | 7:46 AMUpdated Apr 18, 2024 | 7:54 AM
Priyadarshi: హీరో ప్రియదర్శికి హీరోయిన్ వార్నింగ్.. మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ

ఇండస్ట్రీలో అప్పుడప్పుడు నటీనటుల మధ్య రాజుకున్న విబేధాలు సోషల్ మీడియా వేదికగా బయట పడుతుంటాయి. కొన్ని సార్లు వీటిల్లో సీరియస్ వివాదాలుంటే.. కొన్ని సందర్భాల్లో కామెడీగా రియాక్ట్ అయినవి కూడా వైరల్ అవుతుంటాయి. అదలా ఉంచితే తాజాగా టాలీవుడ్ నటుడు, హీరో ప్రియదర్శికి ఓ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. అసలేం జరిగింది.. ఆమె ఎందుకు ఇలా చేసింది అంటే..

హీరోయిన్ నభా నటేష్.. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. దీనికి తోడు ఓ సినిమా షూటింగ్ లో గాయపడటం, రెస్ట్ తీసుకోవడంతో.. ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోని పోస్ట్ చేసి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది నభా.

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇచ్చే స్పీచ్ మీద నభా నటేష్ ఓ రీల్ చేసింది. ప్రభాస్ మాట్లాడితే.. దానిలో కచ్చితంగా డార్లింగ్ అనే పదాలు రిపీట్ అవుతుంటాయి. అలా ప్రభాస్ ఇచ్చిన స్పీచు, అందులోని డార్లింగ్ పదాలతో నభా నటేష్ ఓ రీల్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజనులు దీనిపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్బ్ గా చేశారని అంటున్నారు. అలా ఈ రీల్ మీద నటుడు, హీరో ప్రియదర్శి స్పందించాడు.

వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్.. డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు ప్రియదర్శి. దీనిపై నభా నటేష్ స్పందిస్తూ.. మాటలు కాస్త జాగ్రత్త.. ఆడవాళ్లని డార్లింగ్ అంటే కోర్టులు శిక్ష విధిస్తాయని కౌంటర్ వేసింది. వీరి మెసేజ్ లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నభా నటేష్, ప్రియదర్శి ట్వీట్ల మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

నభా నటేష్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండగా.. ప్రియదర్శి ప్రస్తుతం సినిమాలు,వెబ్ సిరీస్‌లు అంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన ఓం భీం బుష్, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మంచి విజయం సాధించాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş