iDreamPost
android-app
ios-app

Pic Talk: ముసిముసి నవ్వుల ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌! గుర్తుపట్టారా?

  • Published Apr 05, 2024 | 10:40 AM Updated Updated Apr 05, 2024 | 10:40 AM

సోషల్ మీడియాలో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. అదే సినీ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ వైరల్ అవ్వడం. ఈ క్రమంలో తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫోటో ఎవరిదో గెస్ చేసేద్దాం.

సోషల్ మీడియాలో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. అదే సినీ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ వైరల్ అవ్వడం. ఈ క్రమంలో తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫోటో ఎవరిదో గెస్ చేసేద్దాం.

  • Published Apr 05, 2024 | 10:40 AMUpdated Apr 05, 2024 | 10:40 AM
Pic Talk: ముసిముసి నవ్వుల ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌! గుర్తుపట్టారా?

గెస్ ది చైల్డ్ హుడ్ స్టార్, అప్పుడు అందరిని అలరించిన ఈ భామ ఇప్పుడు ఎలా ఉందొ చూసేద్దాం ఇలాంటి క్యాప్షన్స్ తో ఇప్పుడు సోషల్ మీడియా అంతా మోత మోగిపోతుంది. అలనాటి తారలు ఈనాడు ఎలా ఉన్నారు ఎం చేస్తున్నారు అని తెలుసుకోవాలని ఆసక్తి అందరికి ఉంటుంది. అలాగే ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఎంతో మంది సెలబ్రిటీస్ వారి వారి చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని కూడా అందరు క్యూరియాసిటీ చూపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఒక చిన్నారి ఫోటో కూడా ఈ ట్రెండ్ లిస్ట్ లో యాడ్ అయింది. మరి ఆ చిన్నారి ఎవరు .. ఇప్పుడు ఎం చేస్తుంది.. ఎలా ఉంది అనే విషయాల గురించి చూసేద్దాం.

సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ ఫొటోలో ఉన్న చిన్నారి పరిస్థితి కూడా ఇంతే.. ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అందం అభినయం ఎంత ఉన్నా కానీ, అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. అయితే వరుస సినిమా ఆఫర్లు అందుకోలేకపోయిన కూడా.. తెలుగులో తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా.. ప్రేక్షకుల మదిలో మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. తెలుగులో డైరెక్టర్ పూరి జగన్నాథ తెరకెక్కించిన సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. కొంతకాలం సినిమాలు తీసిన తర్వాత.. ఉన్నట్టుండి సినిమాలకు, సోషల్ మీడియాకు దూరం అయిపొయింది. విషయం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే.. తనకు యాక్సిడెంట్ అవ్వడం వలెనే బ్రేక్ తీసుకున్నంటూ విషయం చెప్పేసింది, ఇక ఇప్పుడిపుడే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది ఈ అమ్మడు, ఇంతకీ ఈ చిన్నారి ఎవరో కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫేమస్ హీరోయిన్ నభా నటేష్.

నభా నటేష్ స్వతహాగా కన్నడ కు చెందిన భామ. ఈమె మొదట 2018లో వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత 2019లో దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించిన.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ సాదించింది ఈ అమ్మడు. ఈ సినిమా తర్వాత.. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఈ అమ్మడికి ఆఫర్లు అంతగా రాలేదు. దానికి తోడు 2021లో యాక్సిడెంట్ కావడంతో .. కొన్నాళ్ల పాటు సినిమాలకు, సోషల్ మీడియాకు దూరం అయింది. ఇంకా ఇప్పుడిపుడే మళ్ళీ సినిమాలలో నటించేందుకు రెడీ అయిపొయింది ఈ అమ్మడు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్.. స్వయంభు మూవీలో నభా నటేష్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మరి నభా నటేష్ చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş