iDreamPost
android-app
ios-app

13 ఏళ్లుగా ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన నటి

  • Published Mar 04, 2024 | 9:55 AM Updated Updated Mar 04, 2024 | 9:55 AM

బాలీవుడ్ బుల్లితెర నటి, నాగీన్ ఫేమ్ హీరోయిన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన 13 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెడుతూ పెళ్లి బంధంగా పదిలపర్చుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

బాలీవుడ్ బుల్లితెర నటి, నాగీన్ ఫేమ్ హీరోయిన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన 13 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెడుతూ పెళ్లి బంధంగా పదిలపర్చుకుంది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Mar 04, 2024 | 9:55 AMUpdated Mar 04, 2024 | 9:55 AM
13 ఏళ్లుగా ప్రేమ.. ప్రియుడిని పెళ్లాడిన నటి

ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసిన వరుస పెళ్లి బాజాలనేవి మోగుతున్నాయి. ఈ క్రమంలోనే అటు సామాన్య జనం నుంచి స్టార్ సెల‌బ్రిటీల వరకు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చాలామంది తారలు.. తాము ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వివాహ బంధంతో ఒక‌టౌతున్నారు. తాజాగా మరో బుల్లితెర నటి కూడా తమ 13 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాప్ పెడుతూ.. మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఎంతో ఘనంగా తన పెళ్లి వేడుకలను నిర్వహించుకొని ఇష్టపడిన ప్రియుడితో ఏడడుగులు వేసింది. ఈ చూడ ముచ్చటైన జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..వారి అభిమానులు పెద్ద ఎత్తునే శుభకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంతకి ఆ నటి ఎవరంటే..

బాలీవుడ్ ‘నటి సురభి’ చందన. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ, హిందీలో ‘నాగిన్’ సీరియల్ చూసిన వారికి మాత్రం ఈమె బాగా సుపరిచితమే. కాగా, సురభి ఒక బుల్లితెర నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు హిట్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు ‘కరణ్ శర్మ’తో ఏడడుగులు వేసింది.ఇక తన 13 ఏళ్ల ప్రేమను కాస్త పెళ్లి బంధంతో పదిలపర్చుకుంది. ఇక వీరి వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జైపూర్ జరిగింది. కాగా, జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు పెద్ద ఎత్తునే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ వివాహ వేడుకల్లో కొత్త జంట సిల్వర్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు.

అలాగే ఈ పెళ్లిలోని సురభి.. ఓ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుండగా తాను కూడా ఆ పాటకు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. తన కాబోయే భర్త వైపు అడుగులు వేసింది. కాగా, పెళ్లికి ముందు తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీను కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక సురభి నటన విషయానికొస్తే..’తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో అతిథి పాత్రలో మెరిసింది. అలాగే ‘ఖుబూల్ హై’ అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించింది. అయితే సురభి చందనకు మాత్రం.. ‘ఇష్క్ బాజ్’, ‘సంజీవని’, ‘నాగిన్-5’, ‘హునర్బాజ్: దేశ్ కీ షాన్’ వంటి సీరియల్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీనితో పాటు ఈ బ్యూటీ ‘జాసూస్’ అనే చిత్రంతో వెండితెర పై కూడా మెరిసింది. ఇక కరణ్ విషయానికొస్తే.. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’, ‘పవిత్ర రిష్తా’ వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఇతను ‘ఉదారియన్’ అనే సీరియల్ లో నటిస్తున్నాడు. మరి, 13 ఏళ్ల ప్రేమను, పెళ్లి బంధంతో తెర వేసిన సురభి చందన, కరణ్ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SURBHI CHANDNA & KARAN SHARMA❤️😍🧿 (@sukarlove_)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş