iDreamPost
android-app
ios-app

Naa Saami Ranga: నా సామిరంగ.. అంజిగాడి ఎంట్రీ అదిరింది!

  • Published Dec 15, 2023 | 12:07 PM Updated Updated Dec 15, 2023 | 12:07 PM

నా సామిరంగ సంక్రాంతికి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, శుక్రవారం అల్లరి నరేష్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో గ్లింప్స్‌ విడుదల అయింది. ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది.

నా సామిరంగ సంక్రాంతికి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, శుక్రవారం అల్లరి నరేష్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో గ్లింప్స్‌ విడుదల అయింది. ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది.

  • Published Dec 15, 2023 | 12:07 PMUpdated Dec 15, 2023 | 12:07 PM
Naa Saami Ranga: నా సామిరంగ.. అంజిగాడి ఎంట్రీ అదిరింది!

కింగ్‌ నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. నా సామిరంగ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది. రెండు రోజుల క్రితం నా సామిరంగ నుంచి ఓ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. ఆ పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. హీరో, హీరోయిన్‌ల మధ్య సాగే పాట అంది.

ఇక, శుక్రవారం ‘నా సామిరంగ’ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఇక, ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ ‘ అంజి’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంజి పాత్రకు సంబంధించి ఇంట్రో గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. 50 సెకన్ల నిడివి ఉన్న ఆ ఇంట్రో వీడియో ‘ మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటొచ్చేత్తది’’ అన్న లిరిక్‌ డైలాగ్‌తో వీడియో మొదలవుతుంది. వీడియో మొత్తం అంజిగాడి రచ్చతో నిండిపోయింది. మూవీలో అంజిగాడి హవా ఎలా ఉండబోతోందో చెప్పేశారు.

allari naresh in nasaami ranga movie

అంజి పాత్ర సినిమాలో ఎంత ముఖ్యం.. ప్రధాన పాత్ర నాగార్జునకు ఎంత క్లోజ్‌ అన్నది కూడా వీడియోను బట్టి తెలిసిపోతోంది. ‘‘ మాటొచ్చేత్తది’’ అన్న డైలాగ్‌తో అల్లరి నరేష్‌ అదరగొట్టేశారు. చిత్రంపై అంజి ఆశలు పెంచేస్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాబోతోందని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. కాగా, నా సామిరంగ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నా సామిరంగను తెరకెక్కించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

నాగార్జునకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ బాగా వర్కవుట్‌ అవుతున్నాయి. 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతికి సందర్భంగా.. జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వచ్చింది. 2022లో బంగార్రాజు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగచైతన్య ప్రధాన పాత్రల్లో కనిపించారు. నాగార్జున కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా.. జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయాన్ని నమోదు చేసింది.

‘ నా సామిరంగ’ కూడా సంక్రాంతికే వస్తోంది. నాగార్జునకు కలిసొచ్చిన పండుగ కాబట్టి.. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తుందిన ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి, అంజిగాడి ఇంట్రో వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet