iDreamPost
android-app
ios-app

మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ఫ్రీగా చూసేయండి!

  • Published Mar 04, 2024 | 3:18 PM Updated Updated Mar 04, 2024 | 3:18 PM

Asur Series OTT Streaming on Jio Cinema: భాషతో సంబంధం లేకుండా ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ జోనర్ లో వచ్చిన వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది.

Asur Series OTT Streaming on Jio Cinema: భాషతో సంబంధం లేకుండా ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఎన్నో సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, హర్రర్ జోనర్ లో వచ్చిన వెబ్ సీరీస్ కి మంచి ఆధరణ లభిస్తుంది.

మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ఫ్రీగా చూసేయండి!

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఓటీటీ దే పై చేయి అని చెప్పొచ్చు. ప్రతి వారం పదుల సంఖ్యల్లో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. కామెడీ, హర్రర్, ఫ్యామిలీ ఎంటర్ ‌టైన్‌మెంట్, క్రైమ్ స్టోరీస్ ఇలా ఎన్నో రకాల కంటెంట్ తో వచ్చే మూవీస్, వెబ్ సీరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇదిలా ఉంటే చాలామంది ఆడియన్స్ ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్, హర్రర్, కామెడీ జోనర్ లో వచ్చేవాటికే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.  క్రైమ్స్ థ్రిల్లర్ కి మైథాలజీ జోడిస్తే.. వేరే లెవెలో ఉంటుంది. అలాంటి మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసే అవకాశం లభిస్తుంది. ఇంతకీ ఆ వెబ్ సీరీస్ ఏంటీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా హత్యలు, సస్పెన్స్, ఇన్వెస్ట్ గేషన్ చుట్టూ తిరుగుతుంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కి మైథాలజీ జోడిస్తే.. పూరాణ కాలం నాటి పాత్రలను కలికాలంలో చూపిస్తూ.. క్రైమ్ థ్రిల్లర్ ని తెరపై చూపిస్తే ఆ అనుభూతి వేరే లెవెల్ లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తుందే ‘అసుర 2’. 2020 లో అసుర ఫస్ట్  ఓటీటీలో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మైథలాజికల్ సైకో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిని అసుర ఫస్ట్ సీజన్ మంచి విజయం అందుకుంది. తర్వాత సీజన్ పై అప్పట్లో భారీ అంచనా పెరిగింది.. ఆ అంచనాలకు మించి మూడేళ్ల తర్వాత అసుర్ సీక్వెల్ అసుర్ 2 వచ్చింది. అసుర్ 2 : రైజ్ ఆఫ్ ది డార్స్ సైడ్ టిటిల్ తో గత ఏడాది జూన్ 1న ఓటీటీలో రెండో సీజన్ మంచి విజయం అందుకుంది. ఈ రెండు సీజన్స్ కి ఓనీ సేన్ దర్శకత్వం వహించారు. ఈ సీరీస్ లో అర్షద్ వార్సీ, బరన్ సోబ్టీ, విషాల్ బన్సాల్, అనుప్రియ గోయెంక, రిధి డోగ్రా, అథర్వ విశ్వకర్మ, అమీ వాఘ్, అభిషేక్ చౌహలన్ తదితరులు నటించారు. ధర్మరాజ్ భట్ అధిరిపోయే బీజీఎం అందించారు.

ఇక కథ విషయానికి వస్తే.. ప్రస్తుతం లోకంలో మంచి పై చెడు గెలుస్తుందని.. దాన్ని అడ్డుకోవడానికి కల్కి వస్తాడని.. అప్పుడు అతన్ని చంపి దేవతలపై పగ తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాడు శుభ్ జోషి. ఇందుకోసం సమాజంలో మంచి పేరు ఉన్నవాళ్లను, సామాజిక వేత్తలను టార్గెట్ చేసి చంపేస్తూ ఆ డెబ్ బాడీలను ఫోరెన్సిక్ నిపుణుడైన నిఖిల్ నాయర్ కి పంపుతుంటాడు. ఆ శవాలు ఎవరివి, కిల్లర్ వాళ్లను ఎందుకు చంపుతున్నాడు.. అతని లక్ష్యం ఏంటీ? అనే కోణంలో సీబీఐ ఆఫీసర్ రాజ్ పూత్ ఇన్వెస్ట్‌గేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే థ్రిల్లింగ్ సీన్స్, అనూహ్యమైన మలుపులు, ట్విస్టులు క్షణక్షణం ఉత్కంఠత కలిగిస్తుంటాయి. అసుర్, అసుర్ 2 రెండు సీజన్లు జియో సినిమా ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతున్నాయి. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా హ్యాపీగా ఫ్రీగా చూడవొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటన్ ఈ వెబ్ సీరీస్ పై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş