iDreamPost
android-app
ios-app

స్టార్‌ హీరోపై మరోసారి కామెంట్లు చేసిన సంగీత దర్శకుడు!

  • Published Nov 02, 2023 | 6:23 PM Updated Updated Nov 02, 2023 | 6:23 PM

‘ఇతరులకు ద్రోహం చేయాలని ఎలా అనుకుంటారు. శివకార్తికేయన్ చేసిన ద్రోహం ఎప్పటికో తెలిసింది నాకు. ఏం జరిగిందో తెలుసుకునే సమయానికి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది’

‘ఇతరులకు ద్రోహం చేయాలని ఎలా అనుకుంటారు. శివకార్తికేయన్ చేసిన ద్రోహం ఎప్పటికో తెలిసింది నాకు. ఏం జరిగిందో తెలుసుకునే సమయానికి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది’

  • Published Nov 02, 2023 | 6:23 PMUpdated Nov 02, 2023 | 6:23 PM
స్టార్‌ హీరోపై మరోసారి కామెంట్లు చేసిన సంగీత దర్శకుడు!

ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్‌- సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్ధానికి పైగా సాగిన వీరి స్నేహ బంధం కొన్ని అనుకోని కారణాల వల్ల దూరం అయింది. శివకార్తికేయన్‌ నమ్మక ద్రోహి అంటూ ఇమ్మాన్‌ తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. మీడియా వేదికగా శివకార్తికేయన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఆయన మాట్లాడుతూ.. శివకార్తికేయన్ తనకు నమ్మక ద్రోహం చేశాడన్నారు. ఇక ఈ జన్మలో అతనితో కలిసి పనిచేయనని తేల్చి చెప్పారు.

‘ఇతరులకు ద్రోహం చేయాలని ఎలా అనుకుంటారు. శివకార్తికేయన్ చేసిన ద్రోహం ఎప్పటికో తెలిసింది నాకు. ఏం జరిగిందో తెలుసుకునే సమయానికి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణం తమ ఇద్దరికే తెలుసన్నారు. ఈ విషయంపై మాటలు కూడా అయిపోయాయన్నారు. కానీ, అతను ఏం అన్నాడో నేను బయటకు చెప్పలేనని, ఆ విషయాలను తన పిల్లల కోసం దాచి పెట్టాలనుకుంటున్నానని అన్నారు. తన గురించి సమాజం తప్పుగా అనుకున్నా పట్టించుకోనని తెలిపారు.

తన నిజాయితీ ఏంటనేది ఆ దేవుడికి, కుటుంబానికి తెలుసన్నారు. కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరుగుతాయని, తనకు అన్యాయం జరగడానికి శివకార్తికేయన్ మాత్రమే ముఖ్య కారణమన్నారు. తాజాగా మరో సారి ఆయన శివకార్తికేయన్‌పై స్పందించారు. ‘‘ అంతా దేవుడు చూసుకుంటాడు. తప్పు ఒప్పులు ఏంటో మనిషికంటే దేవుడికే బాగా తెలుసు. అతడే దీనికి ఓ ముగింపు ఇస్తాడు’’ అని పేర్కొన్నారు. మరి, ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్‌- సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom