iDreamPost
android-app
ios-app

ధనుష్ తో గొడవలు నిజమే.. 6 ఏళ్లు మాట్లాడుకోలేదు: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

  • Published Apr 06, 2024 | 5:39 PM Updated Updated Apr 06, 2024 | 5:39 PM

Dhanush: హీరో ధనుష్ తో తనకు గొడవలు జరిగిన మాట నిజమేనని ఇన్నేళ్లకు ఒప్పుకున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ గొడవ కారణంగా 6 ఏళ్లు మాట్లాడుకోలేదని కూడా తెలిపాడు. మరి ఆ సంగీత దర్శకుడు ఎవరు? గొడవకి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

Dhanush: హీరో ధనుష్ తో తనకు గొడవలు జరిగిన మాట నిజమేనని ఇన్నేళ్లకు ఒప్పుకున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ గొడవ కారణంగా 6 ఏళ్లు మాట్లాడుకోలేదని కూడా తెలిపాడు. మరి ఆ సంగీత దర్శకుడు ఎవరు? గొడవకి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

  • Published Apr 06, 2024 | 5:39 PMUpdated Apr 06, 2024 | 5:39 PM
ధనుష్ తో గొడవలు నిజమే.. 6 ఏళ్లు మాట్లాడుకోలేదు: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో పలానా నటీ, నటుల మధ్య గొడవలు, విభేదాలు ఉన్నాయని మనం ఎన్నో సందర్భాల్లో విన్నాం. అయితే ఆ గొడవలపై కొందరు సెలబ్రిటీలు స్పందించడానికి నిరాకరిస్తే.. మరికొందరు మాత్రం బాహాటంగానే దాని గురించి చెప్పుకొస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు తనకు ధనుష్ తో గొడవ జరిగిన మాట నిజమేనని, దాని కారణంగా మేం 6 సంవత్సరాలు మాట్లాడుకోలేదని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. మరి ఆ సంగీత దర్శకుడు ఎవరు? అసలు ఎందుకు గొడవ జరిగింది? ఆ వివరాలు..

ధనుష్.. కోలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. కోలీవుడ్ లోనే కాక తన మూవీస్ తో సౌత్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ప్రయోగాత్మకమైన చిత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు ధనుష్. స్టార్ హీరో ఇమేజ్ ను పక్కనపెట్టి ఎలాంటి పాత్రలైనా చేయడానికి వెనకాడడు. ఇదిలా ఉండగా.. ధనుష్ తో గొడవపడ్డానని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాశ్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవీ ప్రకాశ్.. ధనుష్ తో గొడవ గురించి నోరు విప్పాడు.

“స్నేహితులు అన్నాక ఏదో ఒక విషయంలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అలా ధనుష్ కు నాకు మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. దాంతో ఆరేళ్లు మాట్లాడుకోలేదు. కానీ తర్వాత ఇద్దరం కలిసిపోయాం. ఇక్కడి విశేషం ఏంటంటే? ఆ గొడవ తర్వాత మేమింకా క్లోజ్ అయ్యాం” అంటూ చెప్పుకొచ్చాడు జీవీ ప్రకాశ్. కానీ ఏ విషయంలో గొడవపడ్డారు అనేది మాత్రం చెప్పలేదు. కాగా.. ధనుష్ తో కలిసి క్రికెట్ ఆడటం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక జీవీ ప్రకాశ్ మల్టీటాలెంటెడ్ అని మనందరికి తెలిసిందే. సంగీత దర్శకుడిగా, హీరోగా, సింగర్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Anushka: ప్రభాస్ తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. అనుష్క షాకింగ్ కామెంట్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet