iDreamPost
android-app
ios-app

మొన్న విజయ్‌ ఆంటోనీ.. ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

  • Published Sep 27, 2023 | 8:15 PM Updated Updated Sep 27, 2023 | 8:15 PM
  • Published Sep 27, 2023 | 8:15 PMUpdated Sep 27, 2023 | 8:15 PM
మొన్న విజయ్‌ ఆంటోనీ.. ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

భారత చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న ప్రముఖ తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడి కారణంగా ఇంటర్‌ చదువుతున్న మీరా ప్రాణాలు తీసుకుంది. మీరా మృతి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదం మరువక ముందే తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సామ్‌ సీఎస్‌ తల్లి సేలత్‌మేరీ మరణించారు.

గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం కన్నుమూశారు. ఈ సాయంత్రం తేని జిల్లాలోని నారయణదేవన్‌ పట్టిలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాగా, సామ్‌ సీఎస్‌ 2018లో వచ్చిన దియ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. నోటా, అర్జున్‌ సురవరం, మోసగాళ్లు, రామారావు ఆన్‌ డ్యూటీ, మైకెల్‌, నేనేనా వంటి సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేశారు.

ప్రస్తుతం తమిళంతో పాటు మలయాళ భాషలకు చెందిన సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాదు.. సింగర్‌గా.. లిరిసిస్ట్‌గా కూడా ఆయన తన సత్తా చాటారు. వెంకట్‌ ప్రభు, లోకేష్‌ కనకరాజ్‌ వంటి స్టార్‌ దర్శకులతో పని చేశారు. విక్రమ్‌ వేద, ఖైదీ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. 2010లో వచ్చిన ‘ఓర్‌ ఇరువు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet