iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్ విజేతపై కోడిగుడ్లతో దాడి! స్టార్ అని కూడా చూడకుండా!

  • Published Apr 12, 2024 | 12:40 PM Updated Updated Apr 12, 2024 | 12:40 PM

నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల బిగ్ బాస్ సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాల వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ పై కోడిగుడ్లతో దాడి జరిగింది.

నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల బిగ్ బాస్ సెలబ్రిటీలకు సంబంధించిన వివాదాల వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ పై కోడిగుడ్లతో దాడి జరిగింది.

  • Published Apr 12, 2024 | 12:40 PMUpdated Apr 12, 2024 | 12:40 PM
బిగ్‌బాస్ విజేతపై కోడిగుడ్లతో దాడి! స్టార్ అని కూడా చూడకుండా!

నిత్యం తరచూ ఏదో ఒక ప్రాంతంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన వివాదాలు మాత్రమే ఎక్కువగా వార్తలు  నిలుస్తుంటాయి. అలానే కొందరు సెలబ్రిటీలు నిత్యం వివాదాలతో వార్తలతో నిలుస్తుంటారు. పలు సందర్భాల్లో కొందరు సెలబ్రిటీలపై దాడులు కూడా జరుగుతుంటాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ పై  కోడిగుడ్ల  దాడి జరిగింది. దీంతో అతను కూడా గొడవకు దిగారు. ఇంతకా ఆ  బిగ్ బాస్ విన్నర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

బాలీవుడ్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అనంతరం అక్కడ వచ్చిన  ఫేమ్ లో బుల్లితెరపై షోల్లో సందడి చేశాడు. అలానే 2023లో హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొన్నాడు. తనదైన ఆటతో అందరిని ఆకట్టుకున్నాడు. అలానే ఈ సీజన్ విన్నర్ గా కూడా మునావర్ ఫరూఖ్ నిలిచాడు. ఆ తరువాత పలు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. మునావర్ ఫరూఖీ బిహేవియర్ వల్ల అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో ఓ గొడవలో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అలా తరచు వార్తల్లో నిలిచే మునావర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.

మునావర్ ఫరూఖీపై కోడిగుడ్లతో దాడి జరిగింది. రంజాన్ సందర్భంగా ముంబై మహమ్మద్ అలీ రోడ్ లో జరిగిన ఇఫ్తార్ పార్టీకి మునావర్ వెళ్లాడు. అయితే అతన్ని పిలిచిన రెస్టారెంట్ కి కాకుండా మరో రెస్టారెంట్ కి ఇఫ్తార్ పార్టీకి వెళ్ళడానికి మునావర్ సిద్దపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే పార్టీకి స్వీట్స్ కొనేందుకు ఓ స్వీట్ దుకాణం వద్ద లో మునావర్ ఆగాడు. ఇదే సమయంలో మునావర్ ఫరూఖీని పార్టీకి పిలిచిన రెస్టారెంట్ యజమాని, అతని షాప్ లో పనిచేసే వాళ్ళు కోడిగుడ్లతో అతడిపై దాడి చేశారు.

దీంతో చాలా సమయం పాటు అక్కడ ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. వాళ్లు గుడ్లతో దాడి చేయడంతో మునావర్ కూడా వారితో గొడవకు దిగాడు. కాసేపటి తరువాత కొందరు ఘటన స్థలానికి వచ్చి మునావర్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే రెండు రోజుల క్రితం రాత్రి జరిగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మునావర్ ఫరూఖీపై కోడిగుడ్ల దాడి జరిగిన విషయం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş