iDreamPost
android-app
ios-app

నా భార్యతో విడిపోయి చాలా కాలమైంది.. ఇప్పుడెందుకీ రచ్చ: పవన్ సాయి

  • Published Apr 24, 2024 | 11:50 AM Updated Updated Apr 24, 2024 | 11:50 AM

మొగలి రేకులు ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవన్ సాయి. ముద్ద మందారం సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఈ నటుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

మొగలి రేకులు ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పవన్ సాయి. ముద్ద మందారం సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఈ నటుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

  • Published Apr 24, 2024 | 11:50 AMUpdated Apr 24, 2024 | 11:50 AM
నా భార్యతో విడిపోయి చాలా కాలమైంది.. ఇప్పుడెందుకీ రచ్చ: పవన్ సాయి

సినీ సెలబ్రిటీలే కాదు.. ఇప్పుడు బుల్లితెర కపుల్స్ కూడా విడాకుల బాట పడుతున్నారు. మొన్నటి మొన్న మనసు మమతతో మనసుల్ని దోచిన ప్రియతమ్ చరణ్.. నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ ఇద్దరు కూడా విడాకులు తీసుకోలేదు కానీ, విడిగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మానస గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇప్పుడు మరో బుల్లితెర నటుడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మొగలి రేకులుతో కెరీర్ స్టార్ చేసిన పవన్ సాయి.. ముద్ద మదారంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నాగ భైరవి, మల్లీ, శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ చేశాడు. అతడి అసలు పేరు పవన్ ఆర్యవీర్ రాజ్ పుత్. అతడు మధుమిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

తాజాగా పవన్ తన భార్య నుండి విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు ఈ సీరియల్ నటుడు. ‘ఇటీవల కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో నా మ్యారేజ్ లైఫ్ గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి వస్తున్న కథనాల గురించి విన్నాను. ఉఫ్.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది ఇప్పటి పరిస్థితి. మా కుటుంబ సభ్యులతో చర్చించి.. మేమిద్దం మ్యూచువల్ కన్సెంట్‌తో విడిపోయి చాలా కాలమైంది. నేను, మధు ఎవరి జీవితాలు వారు బతుకుతున్నాం. ఇద్దరం ఒకరికి ఒకరం సహకరించుకుంటున్నాం. దీనిపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నేను నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కాబట్టి దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు పవన్ సాయి. కాగా, ఎప్పుడు సీరియల్స్‌తో బిజీగా ఉంటే పవన్ సాయి ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అని అడగ్గా.. తనతో ఎవరూ లేరని, ఒంటరిగా ఉన్నానని చెప్పడంతో ఈ సీరియల్ నటుడు విడాకులు తీసుకున్నాడన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. ప్రస్తుతం పవన్ సాయి జగద్ధాత్రి సీరియల్లో నటిస్తున్నాడు. ఈ సీరియల్లో ఘట్టమనేని దేవేంద్రగా అలరిస్తున్నాడు పవన్ సాయి.

 

View this post on Instagram

 

A post shared by Pavan Aryaveer Rajput (@pawon.27)

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş