iDreamPost
android-app
ios-app

Mrs Alia-Jr NTR ఎన్టీఆర్ అలియా జోడి అందుకే కుదరలేదు

  • Published Apr 15, 2022 | 11:43 AM Updated Updated Apr 15, 2022 | 11:51 AM
  • Published Apr 15, 2022 | 11:43 AMUpdated Apr 15, 2022 | 11:51 AM
Mrs Alia-Jr NTR ఎన్టీఆర్ అలియా జోడి అందుకే కుదరలేదు

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోయే ప్యాన్ ఇండియా మూవీ నుంచి హీరోయిన్ అలియా భట్ తప్పుకుందనే వార్త ఫ్యాన్స్ ని టెన్షన్ కు గురి చేస్తోంది. ఇది నిజమా కాదా అనేది యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ అసలు ఫిక్స్ అయినట్టు కూడా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్ నోట్ అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో అలియాను చూశాక తారక్ పక్కన జోడిగా ఆమె బాగుంటుందని సగటు ప్రేక్షకులు కూడా భావించారు. ఓ ఇంటర్వ్యూలో అలియానే స్వయంగా యంగ్ టైగర్ తో చేయబోతున్నట్టు చెప్పేసింది. కేవలం కొద్దిరోజుల వ్యవధిలో అన్నీ మారిపోయాయి. దీనికి కారణాలు లేకపోలేదు

అలియా భట్ నిన్నే వైవాహిక జీవితం మొదలుపెట్టింది. భర్త రన్బీర్ కపూర్ తో కలిసి కొద్దిరోజులు ఏకాంతంగా విదేశాలకు వెళ్లే ట్రిప్ ప్లాన్ చేసుకుంది. సెప్టెంబర్ లో రిలీజయ్యే బ్రహ్మాస్త్ర ప్రమోషన్లు మొదలయ్యే లోగా భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అందులో రన్బీరే హీరో ఈమె హీరోయిన్ కాబట్టి . ఇది కాక అలియా చేతి నిండా బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. డార్లింగ్స్, జీ లే జరా, రాకీ రాణికి ప్రేమ్ కహానిను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. వీటికే డేట్లు అధిక శాతం బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు తారక్ ప్రాజెక్టుకి జూన్ నుంచి కాల్ షీట్లు ఇవ్వడం అంత సులభంగా కనిపించడం లేదుట. అందుకే పూర్తిగా డ్రాప్ అయినట్టుగా చెబుతున్నారు.

సో ఎన్టీఆర్ 30 హీరోయిన్ స్పేస్ ఖాళీ అయ్యింది. అలా అని ఆప్షన్లు లేకపోలేదు. హిందీ నుంచే తీసుకోవాలనుకుంటే కియారా అద్వానీ, దిశా పటాని లాంటి వాళ్ళను ట్రై చేయొచ్చు. లేదూ పూజా హెగ్డే ఆల్రెడీ అరవింద సమేత వీర రాఘవలో చేసింది కాబట్టి మరోసారి తనని రిపీట్ చేయొచ్చు. కొరటాల శివ ఇవన్నీ సెట్ చేసే పనిలోనే ఉన్నారు.

ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా బరువు మీద ఫోకస్ పెట్టిన తారక్ మూడు నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకొమని కొరటాలకు చెప్పారట. తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఉంటుంది కాబట్టి ఆలోగా ఫ్రీ అవ్వాలి. ట్రిపులార్ విషయంలో ఫ్యాన్స్ సంగతేమో కానీ తారక్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet