iDreamPost
android-app
ios-app

ఈ వారం థియేటర్లలో 15 సినిమాలు.. ఆ ముడింటిపైనే అందరి ఆసక్తి

  • Published Mar 12, 2024 | 2:20 PM Updated Updated Mar 12, 2024 | 2:20 PM

Movies Release List: మార్చి నెలలో చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదలవుతాయి. అలా ఈ వారంలో 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ లిస్ట్‌ మీ కోసం..

Movies Release List: మార్చి నెలలో చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదలవుతాయి. అలా ఈ వారంలో 15 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ లిస్ట్‌ మీ కోసం..

  • Published Mar 12, 2024 | 2:20 PMUpdated Mar 12, 2024 | 2:20 PM
ఈ వారం థియేటర్లలో 15 సినిమాలు.. ఆ ముడింటిపైనే అందరి ఆసక్తి

సాధారణంగా మార్చి నెలలో పెద్ద సినిమాలు విడుదల కావు. స్వతహాగా ఎగ్జామ్స్ సీజన్ కావడంతో ఏప్రిల్, మే నెలలో భారీ సినిమాలు రిలీజ్‌ అవుతాయి. అందుకే తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే ప్రదర్శించబడుతున్నాయి. గత వారం గామి, భీమా వంటి మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాక ఈ వారం చిన్న, పెద్ద తెలుగు హిందీ అన్నీ కలుపుకుని దాదాపు పదిహేను సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఒకటి రెండు సినిమాలు తప్ప ఏ సినిమా పై కూడా పెద్దగా అంచనాలు లేవు.

బిగ్ బాస్ దివి నటించిన లంబసింగి, రవికుల రఘురామ, రజాకార్, తంత్ర, షరతులు వర్తిస్తాయి, లైన్ మ్యాన్, యోధా, బస్తర్: ది నక్సల్ స్టోరీతో పాటు అనేక చిత్రాల విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాల్లో రజాకార్ సినిమా కాస్త బెటర్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రారంభం నుంచే వివాదాస్పదమైంది. అనసూయ, వేదిక, బాబీ సింహా వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌కు వివాదాల వల్ల చిన్నగా క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమా పై ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెయ్ దరువెయ్ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరిగాయి. స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయిరాం శంకర్, 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఆ తరువాత వరుసగా డిజాస్టర్లు వచ్చాయి. ఇప్పుడు తన ఆశలన్నీ “వెయ్ దరువెయ్” సినిమా పైనే పెట్టుకున్నారు. నేనింతే సినిమాలోని సీన్స్ ఉపయోగించుకుని ఈ సినిమాకి ప్రోమోలు కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. వకీల్ సాబ్ ఫేం అనన్య నాగల్ల నటించిన హర్రర్ చిత్రం ‘తంత్ర’ కూడా మార్చి 15న విడుదల కానుంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

అదిత్ గా “కథ” అనే సినిమాతో ప్రేక్షకులకి పరిచయమై తరువాత త్రిగుణ్ గా పేరు మార్చుకుని తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించిన యువ హీరో ఎప్పుడూ కొత్త కథతో ప్రయోగాలు చేస్తూ ఈసారి కూడా “లైన్ మ్యాన్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బిగ్ బాస్ దివి నటించిన లంబసింగి సినిమా కూడా ఈ వారం థియేటర్లలోకి రాబోతోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో మంచి ఫాలోయర్స్ క్రియేట్ చేసుకున్న చేస్తున్న దివి ఈ సినిమాతో పెద్ద కొట్ కొట్టాలని చూస్తున్నారు. చైతన్య రావు ప్రధాన పాత్రలో నటించిన “షరతులు వర్తిస్తాయి” సినిమాతో పాటు రాశి ఖానా – సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యోధా, అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ కూడా మార్చి 15న థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటిలో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. అయితే ప్రధానంగా తంత్ర, రజాకార్‌, లంబసింగి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis