iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలు, థియేటర్లలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలివే.. ఆ రెండింటిపైనే అందరి చూపు

  • Published Feb 20, 2024 | 9:10 AM Updated Updated Feb 20, 2024 | 9:10 AM

కొత్త వారం ప్రాంరభం అయ్యిందంటే చాలు.. థియేటర్లు, ఓటీటీల్లోకి ఏ చిత్రాలు రాబోతున్నాయి అనే దాని మీదనే అందరి ఆసక్తి. మరి ఈ వీక్‌ రిలీజ్‌ కాబోతున్న మూవీస్‌ ఏవో మీరూ ఓ లుక్కేయండి.

కొత్త వారం ప్రాంరభం అయ్యిందంటే చాలు.. థియేటర్లు, ఓటీటీల్లోకి ఏ చిత్రాలు రాబోతున్నాయి అనే దాని మీదనే అందరి ఆసక్తి. మరి ఈ వీక్‌ రిలీజ్‌ కాబోతున్న మూవీస్‌ ఏవో మీరూ ఓ లుక్కేయండి.

  • Published Feb 20, 2024 | 9:10 AMUpdated Feb 20, 2024 | 9:10 AM
ఈ వారం OTTలు, థియేటర్లలో రిలీజ్‌ కాబోతున్న సినిమాలివే.. ఆ రెండింటిపైనే అందరి చూపు

కొత్త వారం ప్రాంరభమైందంటే చాలు మూవీ లవర్స్‌ ఆలోచనలన్ని ఆవీక్‌ విడుదల కాబోయే సినిమాలపైనే ఉంటాయి. ఏ రోజు ఏ సినిమా థియేటర్‌లోకి వస్తుంది.. వాటిల్లో ఏది చూడాలి అని డిస్కషన్‌ చేసుకుంటారు. ఇప్పుడు ఓటీటీల హవా పెరగడంతో.. చాలా మంది మూవీ లవర్స్‌ వాటికే జై కొడుతున్నారు. తీరిగ్గా వీకెండ్‌ రోజునో.. లేదంటే సెలవు తీసుకున్నప్పుడో.. ఓటీటీల్లో నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీలు, థియేటరల్లో విడుదల కాబోతున్న సినిమాలు ఏవి.. వాటిల్లో వేటిపైన ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారంటే..

గతవారం సందీప్‌ కిషన్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరో సందీప్‌ కిషన్‌ సరసన వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించారు. ఊరు పేరు భైరవకోన హిట్టు టాక్‌ తెచ్చుకుని.. మంచి కలెక్షన్లు సాధించింది.

ఇక ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడే ఎక్కువగా ఉండనుంది. పైగా అన్నీ కామెడీ జానర్‌ చిత్రాలే కావడం విశేషం. హాస్య నటులుగా గుర్తింపు తెచ్చుకున​ వైవా హర్ష, అభినవ్‌ గోమఠం ప్రాధాన పాత్రల్లో నటించిన సినిమాలు ఈ వీక్‌ విడుదల కానున్నాయి. వీరిద్దరు నటించిన మూవీలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. మరీ ఫిబ్రవరి మూడవ వారం థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేసేందుకు వచ్చే సినిమాలపై మీరు ఓ లుక్కేయండి.

సుందరం మాస్టర్..

షార్ట్‌ ఫిల్మ్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఆపై టాలీవుడ్‌లో కమెడియన్‌గా పాపులర్‌ అయ్యాడు నటుడు హర్ష చెముడు అలియాస్‌ వైవా హర్ష. ఇప్పటి వరకు సినిమాల్లో కమెడియన్‌గా చేసిన హర్ష.. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాలో ప్రాధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యాడు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివ్య శ్రీపాద కథానాయికగా నటించింది. ఈ సినిమాను హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా..

మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా నీలో.. అనే డైలాగ్‌ వినిపించగానే.. వెంటనే గుర్తుకు వచ్చేది అభినవ్‌ గోమఠం. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా. ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో నటించారు. అలానే అలీ రెజా, వైశాలి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది.

సిద్ధార్థ్ రాయ్..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు దీపక్ సరోజ్. ఇప్పుడు అతడు హీరోగా రాబోతున్న సినిమా సిద్ధార్థ్ రాయ్. యశస్వి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తన్వి నేగి కథానాయికగా నటిస్తుంది. కొత్తతరం ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ముఖ్య గమనిక..

వేణు మురళీ ధర్ తెరకెక్కించిన సినిమా ముఖ్య గమనిక. ఇందులో విరాన్ ముత్తం శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది..

సైరన్..

జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో రూపొందించిన సినిమా సైరన్. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కూడా ఫిబ్రవరి 23ననే విడుదల చేయనున్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ఆర్టికల్ 370. ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 23ననే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో వచ్చే అయ్యే సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..

  • అవతార్.. ది లాస్ట్ ఎయిర్ బెండర్.. హాలీవుడ్ సినిమా.. ఫిబ్రవరి 22
  • బరీడ్ ట్రూత్.. హిందీ సినిమా.. ఫిబ్రవరి 23
  • అమెజాన్ ప్రైమ్ వీడియో..
  • అపార్ట్మెంట్ 404.. కొరియన్ సిరీస్.. ఫిబ్రవరి 23
  • పోచర్.. తెలుగు డబ్బింగ్.. ఫిబ్రవరి 23
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
  • విల్ ట్రెంట్.. వెబ్ సిరీస్.. ఫిబ్రవరి 21
  • మలైకోట్టై వాలిబన్.. మలయాళం.. ఫిబ్రవరి 23

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet