iDreamPost
android-app
ios-app

విడాకుల గురించి చెప్తూ వంశీ రెడ్డి ఎమోషనల్‌! నీ లైఫ్‌ సరిగ్గా లేదంటూ!

  • Published Jan 19, 2024 | 12:25 PM Updated Updated Jan 19, 2024 | 1:11 PM

Vamsi Krishna Reddy-Divorce: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి భార్య నేత్రా రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెబుతూ.. ఎమోషనల్‌ అయ్యాడు. ఆ వివరాలు..

Vamsi Krishna Reddy-Divorce: మోటివేషనల్‌ స్పీకర్‌ వంశీకృష్ణారెడ్డి భార్య నేత్రా రెడ్డి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెబుతూ.. ఎమోషనల్‌ అయ్యాడు. ఆ వివరాలు..

  • Published Jan 19, 2024 | 12:25 PMUpdated Jan 19, 2024 | 1:11 PM
విడాకుల గురించి చెప్తూ వంశీ రెడ్డి ఎమోషనల్‌! నీ లైఫ్‌ సరిగ్గా లేదంటూ!

మోటివేషనల్‌ స్పీకర్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు వంశీకృష్ణరెడ్డి. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా.. సరే ధైర్యంగా ముందుకు సాగాలి.. కష్టాలు వస్తే కుంగిపోకూడదు.. విజయాలు వస్తే పొంగిపోకూడదు.. అవమానించే వారికి దూరంగా ఉండాలి.. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగు.. కష్టాన్ని నమ్ముకో.. బంధాన్ని నిలబెట్టుకోవాలంటే తగ్గినా తప్పులేదు.. బంధాన్ని కాపాడుకోవాలంటే సారీ చెప్పడం ముఖ్యం అంటూ మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను ఎలా దాటాలో తన మాటల ద్వారా వివరిస్తూ.. జీవితం మీద నమ్మకం కలిగించే మాటలు చెప్తూ ఎదుటి వారిలో ధైర్యం నింపేవాడు. అలానే మోటివేషనల్‌ వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేస్తూ.. తెలుగులో బెస్ట్‌ మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీకృష్ణారెడ్డి.

యూట్యూబ్‌లో మోటివేషనల్‌ వీడియోలు అప్లోడ్‌ చేస్తూ.. గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణారెడ్డి రెండేళ్ల క్రితం నేత్రా రెడ్డి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేసే నేత్రా రెడ్డి కూడా తన పనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అప్లోడ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఆ తర్వాత కలిసి వీడియోలు చేస్తూ.. ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారు. అయితే వీరి వివాహాన్ని ఇరు కుటుంబాల్లో ఒప్పుకోలేదు. దాంతో అందరికి దూరంగా వీరిద్దరూ మాత్రమే కలిసి ఉండేవారు. సుమారు రెండేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న వీరు.. కొన్ని రోజుల క్రితం విడిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు వంశీకృష్ణారెడ్డి, నేత్రా రెడ్డిలు.

vamsi krishna reddy emotional words

ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి ఐడ్రీమ్‌ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ విడాకులకు గల కారణాలు వివరించాడు. అంతేకాక విడాకులు ప్రకటన తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘మా విడాకులు గురించి ప్రకటించినప్పుడు చాలా మంది నాకు సపోర్ట్‌ ఇచ్చారు. బాధపడకండి అని సూచించారు.. కొందరు మంచి నిర్ణయం అని ప్రశంసించారు. అయితే మనుషులంతా ఒకే విధంగా ఉండరు కదా. అందుకే కొందరు విమర్శలు చేశారు. నీ లైఫే సరిగ్గా లేదు.. నువ్వేంటి మాకు చెప్పేది అంటూ విమర్శించారు’’ అని ఎమోషనల్‌ అయ్యారు.

‘‘అలా విమర్శలు చేసే వారికి మా జీవితంలో ఏం జరిగిందో తెలియదు కదా. వాళ్లు మాతో ట్రావేల్‌ చేయలేదు.. మా సమస్యలు వారికి తెలియలేదు. అయినా సరే ఊరికే కామెంట్స్‌ పాస్‌ చేస్తారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే మనం ప్రశాంతంగా ఉండలేము. అందుకే ఆ కామెం‍ట్స్‌ని మనసుకు తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగత కారణాల వల్లే విడిపోయామని.. ఆ రీజన్స్‌ చెప్పలేనని తెలిపాడు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş