అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ! ప్రశాంత్ వర్మ ప్లాన్ ఓ రేంజ్ లో!

Mokshagna Is Playing Abhimanyudu Role Speculation: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఒక భారీ సబ్జెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది అంట.

Mokshagna Is Playing Abhimanyudu Role Speculation: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఒక భారీ సబ్జెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది అంట.

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. బాలకృష్ణ ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు. ఇప్పుడు ఈ కాంబోకి సంబంధించి కొన్ని క్రేజీ వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చే మూవీ లైన్ ని కూడా చెప్పేస్తున్నారు. మోక్షజ్ఞను అభిమాన్యుడిగా చూపించబోతున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మోక్షజ్ఞ కూడా ఒక సూపర్ హీరో తరహాలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అంటున్నారు. అయితే అభిమన్యుడిగా ఎందుకు? అనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు.

నందమూరి మోక్షజ్ఞ తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చేందుకు చాలా ఉత్సుకతతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగా భారీగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకో 5 వారాల్లో మోక్షజ్ఞ పుట్టిన రోజు కూడా ఉంది. ఈ సందర్భంగా తెలుగు సినిమా ప్రేక్షకులకు మోక్షజ్ఞ నుంచి ఒక క్రేజీ సర్ ప్రైజ్ ఉంటుంది అంటున్నారు. అందుకు తగినట్లుగానే పనులు చకాచకా చేస్తున్నారంట. అందులో భాగంగానే ఇప్పుడు మోక్షజ్ఞ ప్లే చేస్తున్న రోల్ కి సంబంధించి క్రేజీ వార్తలు వినిపిస్తున్నాయి. మహాభారతంలోని ఒక యువ సంచలనంగా మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ పరిచయం చేయబోతున్నాడని చెబుతున్నారు. అదే అండి.. అర్జునుడి కుమారుడు అభిమన్యుడిగా.

అభిమన్యుడిగానే ఎందుకు?:

అభిమన్యుడు అనగానే చాలా మంది అదేంటి.. చనిపోయే వీరుడి పాత్రలో మోక్షజ్ఞను చూపించడం ఏంటి అని అడుగుతున్నారు. మోక్షజ్ఞ వయసుకు.. తెలుగు ప్రేక్షకుల్లో అతని ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న మాస్ ఎక్స్ పెక్టేషన్స్ ని బ్యాలెన్స్ చేసే పాత్ర అభిమన్యుడు అవుతుందని ప్రశాంత్ వర్మ బలంగా నమ్ముతున్నాడంట. అలాగే ప్రశాంత్ వర్మను బాలకృష్ణ నమ్ముతున్నాడు. అభిమన్యుడు చేసింది ఒక్కరోజు యుద్ధమే కావచ్చు.. కానీ, చరిత్రలో నిలిచిపోయాడు. పద్మవ్యూహంలోకి వెళ్లి వేల మంది సైన్యాన్ని ఎదుర్కొన్న మహా వీరుడు. ఒంట్లో బెరుకు, చావంటే భయంలేని మహా యోధుడు. ఇలాంటి పాత్ర అయితే అటు మోక్షజ్ఞ వయసుకు, ఎలివేషన్స్ పరంగా అతనికి ఉన్న ఫాలోయింగ్ ని మ్యాచ్ చేసేలా ఉంటుందని ప్రశాంత్ వర్మ భావించాడంట. అదే జరిగితే మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ మూవీకి థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. మోక్షజ్ఞ పుట్టినరోజు నాటికి కచ్చితంగా ఈ మూవీకి సంబంధించి, మోక్షజ్ఞ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. మోక్షజ్ఞ.. అభిమన్యుడిగా చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments