iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7లోకి సింగర్ మోహనా భోగరాజు!

  • Published Jul 13, 2023 | 4:46 PM Updated Updated Jul 13, 2023 | 4:46 PM
  • Published Jul 13, 2023 | 4:46 PMUpdated Jul 13, 2023 | 4:46 PM
బిగ్ బాస్ 7లోకి సింగర్ మోహనా భోగరాజు!

బుల్లెట్ బండి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఈ మధ్య బరాత్ లో ఈ పాట లేకుండా పెళ్లిళ్లు కావట్లేదు అంటే మీరే అర్థం చేసుకోండి. అలాంటి ఫేమస్ పాట పాడిన సింగర్ మోహనా భోగరాజు కూడా ఎంతో ఫేమస్. 2013లో సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడింది. ఒక్క తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, పంజాబీలో కూడా పాటలు పాడి అభిమానులను సొంతం చేసుకుంది. బాహుబలిలో మనోహరి పాటతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బుల్లెట్ బండి పాటతో ఆ గుర్తింపు నెక్ట్స్ లెవల్ కు వెళ్లింది.

అలాంటి ఫేమస్ సింగర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరిత చేరువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఆమె పేరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి బాగా వైరల్ అవుతోంది. మోహనా భోగరాజు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే.. బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ కి సంబంధించి ఢోకా ఉండదనే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Mohana Bhogaraju (@mohanabhogaraju)

ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఎన్నో లీక్స్, అప్ డేట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ తొలి వారంలోనే బిగ్ బాస్ ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. వచ్చే నెలలో బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ తెలుగు 7కి సంబంధించి సెట్ వీడియో కూడా సోషల్ మీడియాలో లీక్ అవడం చూశాం. ఈ సీజన్ చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ కి ఎలాంటి కొరత రాకుండా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాస్త బాగా తెలిసిన ముఖాలనే ఇంట్లోకి పంపాలనేది ఈసారి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Mohana Bhogaraju (@mohanabhogaraju)

లాస్ట్ సీజన్ లో షో కాస్త డల్ అవడం చూశాం. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ప్రత్యేక చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లీకుల వీరులు కామెంట్ చేస్తున్నారు. దానికి తోడు టాస్కులు, ఎలిమినేషన్స్ కూడా ఎంతో కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ నిజంగానే పక్కా వైరల్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన లోగో కూడా కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉంది. ఇప్పుడు వస్తున్న లీకుల్లో ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరెవరి పేర్లు వినిపిస్తాయో.. ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయో తెలియాలంటే షో అధికారికంగా స్టార్ట్ అయిందాకా ఆగాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Mohana Bhogaraju (@mohanabhogaraju)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş