iDreamPost
android-app
ios-app

Pavitranath: మొగలి రేకులు సీరియల్‌ దయ మృతి… అసలేం జరిగిందంటే!

  • Published Mar 02, 2024 | 10:06 AM Updated Updated Mar 02, 2024 | 10:10 AM

మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దయ ఆలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు. అసలేం జరిగింది అనే దాని గురించి.. సన్నిహితులు కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దయ ఆలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు. అసలేం జరిగింది అనే దాని గురించి.. సన్నిహితులు కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు..

  • Published Mar 02, 2024 | 10:06 AMUpdated Mar 02, 2024 | 10:10 AM
Pavitranath: మొగలి రేకులు సీరియల్‌ దయ మృతి… అసలేం జరిగిందంటే!

మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ అకస్మాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తోటీ నటులు ఇంద్రనీల్‌, మేఘన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా తెలిసింది. ఇక దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు పవిత్రనాథ్‌ ఎప్పుడు చనిపోయాడు.. ఏవైనా అనారోగ్య సమస్యలా.. లేక వ్యక్తిగత ఇబ్బందులా.. అసలేం జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే పవిత్రనాథ్‌ ఎప్పుడు మృతి చెందాడనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే.. గత కొన్నాళ్లుగా అతడి జీవితంలో అనేక సమస్యలు ఎదర్కొన​ఆనడు. ముఖ్యంగా భార్య అతడిపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు..

పవిత్రనాథ్‌పై రెండేళ్ల క్రితం అతడి భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి అని తెలిపింది. జాతకం పేరుతో అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాక తనతో వివాహం అయిన తర్వాత కూడా ఓ అమ్మాయితో 8 ఏళ్ల పాటు సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని శశిరేఖ ఆరోపించింది. ప్రతి రోజు తాగొచ్చి టార్చర్‌ పెడతాడని.. అతడు ఏ సీరియల్స్‌లో నటిస్తున్నాడో అనే విషయం కూడా తనకు చెప్పడని.. పదేళ్ల నుంచి తాను నరకం చూస్తున్నానని వెల్లడించింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

అయితే దీనిపై పవిత్రనాథ్‌ ఎక్కడా స్పందించలేదు. ఆ తర్వాత అతడు సీరియల్స్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. సోషల్‌ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. అయితే భార్య ఆరోపణలు, చేతిలో పని లేకపోవడం వల్ల అతడు మానసికంగా కృంగి పోయాడని.. చాలా కాలం నుంచి ఇండస్ట్రీ మిత్రులతో కూడా దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఈక్రమంలోనే అతడు ఆకస్మాత్తుగా మృతి చెందాడు. అయితే అనారోగ్య సమస్యలా.. లేక వ్యక్తిగత కారణాల వల్ల ఇలా జరిగింది అనేది మాత్రం తెలియలేదు. ఇక పవిత్రనాథ్‌ మృతిపై అతడి కుటుంబ సభ్యులు స్పందించి అధికారిక ప్రకటన చేస్తే.. దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.

కానీ తన నటన ద్వారా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు పవిత్రనాథ్‌. దయ పాత్ర అతడికి ఎంతో పేరు తెచ్చింది. చాలా మంది తమ నిజ జీవితంలో ఇలాంటి తమ్ముడు, స్నేహితుడు ఉంటే బాగుండు అనుకునేలా ఆ పాత్రలో నటించి మెప్పించాడు పవిత్రనాథ్‌. ఇక ఇతడికి నటుడు ఇంద్రనీల్‌తో సన్నిహిత సంబంధం ఉంది. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో పవిత్రనాథ్‌ ఇంద్రనీల్‌ తమ్ముడి పాత్రలో చేశాడు. నిజజీవితంలో వీరిద్దరి బంధం అలానే ఉండేది అంటారు. అందుకు నిదర్శనమే తాజాగా ఇంద్రనీల్‌, మేఘన చేసిన పోస్ట్‌. ఏది ఏమైనా పవిత్రనాథ్‌ మృతి వార్త.. అభిమానులను శోకసంద్రంలో పడేసింది.

marsbahis girişjojobet