iDreamPost
android-app
ios-app

మొగలి రేకులు సీరియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ బాస్ 7లోకి సాగర్!

మొగలి రేకులు సీరియల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బిగ్ బాస్ 7లోకి సాగర్!

బిగ్ బాస్.. విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఇండియాలో కూడా బాగా క్లిక్ అయింది. ఇండియాలో కూడా ఎన్నో భాషల్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు గురించి చెప్పుకోవాలి. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ షోని ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే 6 సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. మరోవైపు ఓటీటీ కూడా ఒక సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఎదురుచూపులు ప్రారంభించారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 7వ సీజన్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభంకానుందని చెబుతున్నారు. ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండటంతో.. ఎవరెవరు ఇంటి సభ్యులుగా వస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. పాల్గొనేది వీళ్లే అంటూ చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటిలో ఒక పేరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ పేరు ఎవరిదో కాదు.. మొగలి రేకులు ఫేమ్ సాగర్. తెలుగు బుల్లితెర హిస్టరీ మొగలి రేకులు సీరియల్ కు ఉన్న క్రేజ్, ఆ సీరియల్ కల్ట్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో కార్తీక దీపం సీరియల్ కు ఎంత ఫ్యాన్ బేస్ వచ్చిందో.. సోషల్ మీడియా లేని రోజుల్లోనే మొగలి రేకులు సీరియల్ అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అలాంటి సీరయల్ హీరో సాగర్ ఇప్పుడు బిగ్ బాస్ లోకి వస్తున్నాడు అని వార్త రాగానే బుల్లితెర ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాగర్ ని బిగ్ బాస్ చూడబోతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mulukuntla Sagar (@rksagarofficial)

అయితే బిగ్ బాస్ షోకి సంబంధించి.. స్టేజ్ మీద ప్రకటించే వరకు కూడా.. ఎవరు లోపలికి వెళ్తారు అనే విషయాన్ని కచ్చితంగా చెప్పడానికి లేదు. హోస్ట్ పేర్లు ప్రకటించే వరకు కూడా.. వీళ్లు ఖాయం అనడానికి ఉండదు. ఎందుకంటే.. గతంలో ప్రోమోలు కట్ చేసి స్టేజ్ మీదకు రాకుండా ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. అందుకే బిగ్ బాస్ విషయంలో ఏదీ నమ్మకంగా చెప్పలేం. కానీ, సాగర్ వస్తే బాగుండు అంటూ ప్రేక్షకులు ఇప్పటి నుంచి కోరుకోవడం ప్రారంభించారు. మరి.. మొగలి రేకులు సాగర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mulukuntla Sagar (@rksagarofficial)

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique