iDreamPost
android-app
ios-app

Mithun Ramesh: నటుడికి పక్షవాతం.. భార్య చేసిన పనికి హ్యాట్సాఫ్‌!

నటుడు మిధున్‌ రమేష్‌ కొద్దిరోజుల క్రితం బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డాడు. ఫేషియల్ పెరాలసిస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ముఖంలోని కండరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది...

నటుడు మిధున్‌ రమేష్‌ కొద్దిరోజుల క్రితం బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డాడు. ఫేషియల్ పెరాలసిస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ముఖంలోని కండరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది...

Mithun Ramesh: నటుడికి పక్షవాతం.. భార్య చేసిన పనికి హ్యాట్సాఫ్‌!

ప్రముఖ మలయాళ నటుడు మిథున్ రమేష్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఈయన గురించి కేరళ టీవి ప్రేక్షకులందరికి సుపరిచతమే. రమేష్ 2000 సంవత్సరంలో.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌ అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. కేవలం నటుడిగానే కాదు.. రేడియో జాకీగా కూడా మిధున్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. కామెడీ ఉత్సవం అనే కామెడీ షోతో పాటు వివిధ టెలివిజన్ రియాలిటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.

మంచి పాపులారిటి సంపాదించుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మిథున్ రమేష్‌ తీవ్ర అనార్యోగ సమస్యతో బాధపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి బయటపడిన రమేష్ తాజాగా తన భార్య కూతురితో కలిసి దిగిన ఓ ఫోటోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మిథున్ రమేష్‌ ఇటీవల బెల్స్ పాల్సీ అనే వ్యాధి బారినపడ్డాడు. దీనినే ఫేషియల్ పెరాలసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ముఖంలో పక్షవాతంలా వచ్చి చాలా అందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల ముఖంలో ఒకవైపు కండరాలు సరిగా పని చేయవు.

ఈ క్రమంలో.. ముఖం వంకరగా కనిపిస్తుంది. ముఖ్యంగా నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మిథన్ రమేష్ గత కొంతకాలంగా ఇదే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ సమయంలో.. మిథన్ భార్య లక్ష్మీ ఆయనకు ఎంతో అండగా నిలిచింది. తన భర్తకు త్వరగా నయమైతే.. ఏడుకొండలు వచ్చి గుండు కొట్టించకుంటానని తిరుపతి వెంకటేశ్వరస్వామికి సైతం మొక్కుకుంది. లక్ష్మీ కోరికను  తిరుమల దేవుడు మన్నించాడు. రమేష్ వ్యాధి నుంచి దాదాపుగా కొలుకున్నాడు.  ఈ నేపథ్యంలో మొక్కు ప్రకారం.. లక్ష్మీ తిరుపతిలో తలనీలాలు కూడా సమర్పించుకుంది.

తాను మొక్కుకున్నట్లుగానే గుండు గీయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిథున్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అందులో.. ‘బెల్స్ పాల్సీ వ్యాధితో నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీ అందరికీ తెలుసు. మీ అందరి ప్రార్థనల వల్ల నేను మళ్లీ మామూలు మనిషినయ్యాను. ముఖ్యంగా నా భార్య అయితే ఆ భగవంతుడిని ప్రార్థించని రోజంటూ లేదు. ఈ వ్యాధి నుంచి బయటపడితే తాను తలనీలాలు ఇస్తానని తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకుంది.

ఇదిగో ఇప్పుడు ఆ మొక్కు తీర్చేసుకుంది. ఇంతకంటే ఆమెను నేను ఏమని అడగాలి. ఇంతటి ప్రేమ, త్యాగం, నమ్మకం చూపిస్తున్నందుకు కృతజ్ఞత’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు స్పందిస్తూ మిథున్ పై లక్ష్మీ ప్రేమను కొనియాడుతున్నారు. మరి, మిథున్ భార్య లక్ష్మీపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mithun (@rjmithun)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet