iDreamPost
android-app
ios-app

RC 16 లో రామ్ చరణ్ తో మున్నా భాయ్.. ?

  • Published Nov 23, 2024 | 4:41 PM Updated Updated Nov 23, 2024 | 4:41 PM

RC16 Updates : ఆల్రెడీ కన్నడ యాక్టర్ శివ రాజకుమార్ RC 16 లో భాగం కానున్నారని విషయం తెలుసిందే. ఇక రీసెంట్ గా జగపతి బాబును కూడా టీమ్ లో ఇన్వైట్ చేశారు. దానికి జగపతి బాబు కూడా థాంక్యూ కమేండర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా సరే ఇప్పుడు RC 16 గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే..

RC16 Updates : ఆల్రెడీ కన్నడ యాక్టర్ శివ రాజకుమార్ RC 16 లో భాగం కానున్నారని విషయం తెలుసిందే. ఇక రీసెంట్ గా జగపతి బాబును కూడా టీమ్ లో ఇన్వైట్ చేశారు. దానికి జగపతి బాబు కూడా థాంక్యూ కమేండర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా సరే ఇప్పుడు RC 16 గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే..

  • Published Nov 23, 2024 | 4:41 PMUpdated Nov 23, 2024 | 4:41 PM
RC 16 లో రామ్ చరణ్ తో మున్నా భాయ్.. ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం సర్వం సిద్ధం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా హడావిడితో పాటు.. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చి బాబు ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ముందు.. చేతిలో స్క్రిప్ట్ పేపర్స్ పట్టుకుని గుడి బయట బుచ్చి బాబు దిగిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనితో మైసూర్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నటి కాకుండా బుచ్చి బాబు అనేక మంది ప్రముఖులను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ కన్నడ యాక్టర్ శివ రాజకుమార్ RC 16 లో భాగం కానున్నారని విషయం తెలుసిందే. ఇక రీసెంట్ గా జగపతి బాబును కూడా టీమ్ లో ఇన్వైట్ చేశారు. దానికి జగపతి బాబు కూడా థాంక్యూ కమేండర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా సరే ఇప్పుడు RC 16 గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో ఫేమస్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఫేమ్ మున్నా భాయ్.. చరణ్ తో పాటు యాక్ట్ చేయనున్నాడట. మున్నా భాయ్ అసలు పేరు దివ్యేందు. కానీ మీర్జాపూర్ సిరీస్ చూసిన చాలా మందికి అతను మున్నా భాయ్ గానే తెలుసు. ఈ సినిమాలో దివ్యేందు ఓ కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. త్వరలోనే మేకర్స్ కూడా దీనిని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.

మీర్జాపూర్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో తెలియనిది కాదు. ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. దీనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. రెండు సీజన్స్ లో మున్నా భాయ్ గా అలరించిన దివ్యేందు. మూడు సీజన్ లో లేకపోయేసరికి కొంతమంది నిరాశ వ్యక్తం చేశారు. అంతలా దివ్యేందు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే. ఇక అతని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా ఆ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. ఇప్పటివరకు అయితే క్యాస్టింగ్ లో ఇంకా ఎవరెవరు భాగం కానున్నారు అనే విషయాలు బయటకు రాలేదు. త్వరలోనే టీం ఈ విషయంలో క్లారిటి ఇవ్వనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss