దేశం తరపున ఆడాలనుకున్నా.. యాక్సిడెంట్ వల్ల యాక్టర్ అయ్యా: మీర్జాపూర్ నటుడు

దేశం తరఫున ఆడాలనుకున్న తాను.. ఓ యాక్సిడెంట్ కారణంగా యాక్టర్ గా మారానని చెప్పుకొచ్చాడు మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశం తరఫున ఆడాలనుకున్న తాను.. ఓ యాక్సిడెంట్ కారణంగా యాక్టర్ గా మారానని చెప్పుకొచ్చాడు మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

‘మీర్జాపూర్ 3’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ప్రసారం అయిన తొలి వారంలోనే ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన సీజన్ 1 హిట్ కాగా.. ఈ తర్వాత వచ్చిన సీజన్ 2 కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న మీర్జాపూర్ 3 రికార్డులను కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో గుడ్డు పండిట్ గా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అలీ ఫజల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అలీ ఫజల్ అంటే ఎవ్వరికీ పెద్దగా తెలీకపోవచ్చు. కానీ గుడ్డ పండిట్ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. మీర్జాపూర్ 3 కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. ఈ క్రమంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడాడు అలీ ఫజల్. “మీర్జాపూర్ సీజన్ 3  ఈ రేంజ్ లో హిట్ అవుతుందని నేను అనుకోలేదు. అసలు నేను సినిమాల్లోకి రావాలని కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ ను. దేశం తరపున ఆడాలని ఎన్నో కలలు కన్నాను. కానీ.. స్కూల్ డేస్ లో నాకు జరిగిన యాక్సిడెంట్ వల్ల నా భుజానికి తీవ్రగాయమైంది.

‘అయినప్పటికీ.. గాయం నుంచి కోలుకున్న తర్వాత బాస్కెట్ బాల్ ఆడటానికి ప్రయత్నించాను. భుజం నొప్పిలేవడంతో.. అందులో కొనసాగలేకపోయాను. ఆటలకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో.. నటనవైపు అడుగులు వేసి ఇలా మీ ముందుకు వచ్చాను” అంటూ చెప్పుకొచ్చాడు అలీ ఫజల్. ఇక తాను కల కన్నట్లుగా ఇండియా తరపున బాస్కెట్ బాల్ ఆడలేకపోతున్నానని తెలియడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపాడు. ఇదిలా ఉండగా.. మీర్జాపూర్ 3 అమెజాన్ ప్రైమ్ లో రికార్డ్ వ్యూయర్ షిప్ తో దూసుకెళ్తోంది. 180కి పైగా దేశాల్లో ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Show comments