iDreamPost
android-app
ios-app

వీడియో: చాలా ఏళ్ళ తరువాత ఢీ షోలో అదిరిపోయే పెర్ఫామెన్స్!

  • Published Jul 13, 2024 | 1:46 PM Updated Updated Jul 13, 2024 | 1:46 PM

స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్న డ్యాన్స్ షో ఢీ. ఇప్పటికే ఎన్నో సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎంతో మంది డ్యాన్సర్లుగా వచ్చి కొరియోగ్రాఫర్లుగా మారారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. ఇందులో ఓ కంటెస్టెంట్ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్న డ్యాన్స్ షో ఢీ. ఇప్పటికే ఎన్నో సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎంతో మంది డ్యాన్సర్లుగా వచ్చి కొరియోగ్రాఫర్లుగా మారారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. ఇందులో ఓ కంటెస్టెంట్ వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

  • Published Jul 13, 2024 | 1:46 PMUpdated Jul 13, 2024 | 1:46 PM
వీడియో: చాలా ఏళ్ళ తరువాత ఢీ షోలో అదిరిపోయే పెర్ఫామెన్స్!

బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్‌తో పాటు అలరిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్. వాటిల్లో ఒకటి ఢీ డ్యాన్స్ షో. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు పండు, ఆఖ్సాఖాన్. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా.. కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ.. కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకువస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు ఆది, శ్రీసత్య.  జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు స్టార్ నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్.

ఈ మధ్య కాలంలో డ్యాన్స్ షోస్ అంటే విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంటున్నాయి. డ్యాన్స్ తప్ప.. మిగిలినవీ అన్ని ఉంటున్నాయి. అదొక అడల్ట్ కామెడీ షోగా తయారయ్యిందన్న విమర్శలు వినిపించాయి. జిమ్నాస్టిక్స్ చేస్తున్నారని, మూమెంట్స్ అస్సలు ఉండటం లేదని, సర్కస్ ఫీట్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ అన్నింటికి చెక్ పెడుతూ .. కేవలం డ్యాన్సుతో జవాబు ఇచ్చింది జాను లిరి  అనే కంటెస్టెంట్. ఢీ సెలబ్రిటీ స్పెషల్-2లో ‘సెనిగ చేలా నిలబడి చేతులియ్యావే’ అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసింది జాను. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ ఫోక్ డ్యాన్సర్ అయిన జాను.. ఈ పాటకు ఇచ్చి పడేసింది. గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాటకు కాలు కదిపిన ఈ నెమలి.. ఇప్పుడు ఢీ షోలో కూడా తన పెర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది.

Sekhar Master

మాస్ ఎక్స్ ప్రెషన్స్, హుక్ స్టెప్స్, ఎంతో ఎనర్జటిక్‌గా వేయడంతో ఫిదా అయిపోయారు జడ్జస్. శేఖర్ మాస్టర్ ఆమె డ్యాన్స్ చేస్తుంటేనే ఫిదా అయిపోయాడు. సీట్లో కూర్చొని ఊగిపోయాడు ఆమె వేస్తున్న స్టెప్స్ చూసి. జానును ప్రశంసలతో ముంచెత్తాడు శేఖర్ మాస్టర్. ‘జడ్జి చైర్‌లో కూర్చుని.. సాంగ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసింది రెండు మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు. ఈ మధ్యకాలంలో ఇలా ఎంజాయ్ చేసింది’ లేదు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. తన డ్యాన్స్‌కు ఫ్లాట్ అయిపోయానంటూ మోకాళ్ల మీద పడి ఆమెకు సెల్యూట్ చేశాడు. టాలెంట్ ఎవరు.. ఎక్కడ ఆపలేరు అంటూ ప్రశంసించాడు. ఇక గణేష్ మాస్టర్ మాటల్లేవ్ అంటూ విజిల్ వేసి ఆమె ఫెర్ఫామెన్స్ ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet