iDreamPost
android-app
ios-app

ఫోన్ చేసి వస్తావా అని అడిగాడు.. మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్

  • Published May 14, 2024 | 6:01 PM Updated Updated May 14, 2024 | 6:01 PM

Mirchi Madhavi Sensational Comments: సినీ ఇండస్ట్రీ ఎంతో అందమైన లోకం అంటారు. అయితే ఇక్కడ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ జీవితంలో ఎంతో నరకం అనుభవించామని.. కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉంటుందని బహిరంగంగానే అంటున్నారు.

Mirchi Madhavi Sensational Comments: సినీ ఇండస్ట్రీ ఎంతో అందమైన లోకం అంటారు. అయితే ఇక్కడ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ జీవితంలో ఎంతో నరకం అనుభవించామని.. కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉంటుందని బహిరంగంగానే అంటున్నారు.

  • Published May 14, 2024 | 6:01 PMUpdated May 14, 2024 | 6:01 PM
ఫోన్ చేసి వస్తావా అని అడిగాడు.. మిర్చి మాధవి షాకింగ్ కామెంట్స్

దేశంలో మహిళలపై ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం లైంగిక వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. సామాన్య మహిళలకే కాదు.. సినీ సెలబ్రెటీలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. ఇటీవల చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇటీవల తమకు ఎదురైన లైంగి వేధింపుల గురించి పలు ఇంటర్వ్యూల్లో ధైర్యంగా చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఆటబొమ్మళ్లా చూస్తారని.. ఆఫీస్ బాయ్ నుంచి నిర్మాతల వరకు అనుభవించాలని చూస్తారని చెబుతున్నారు నటీమణులు. తాజాగా మిర్చి నటి మాధవి తన కెరీర్ లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో మిర్చీ మాధవి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు.  తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా పేరుతోనే ఇండస్ట్రీలో కొనసాగుతుంది. మిర్చి మాధవి తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తుంది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ లో మిర్చీ మాధవి కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విన్నా.. ఆ చేదు అనుభవం నా జీవితంలో ఒక్కసారి అయ్యింది. ఒక మూవీలో నన్ను ఎంపిక చేశారు. డైరెక్టర్ కి సంబంధించిన ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీకు ఈ మూవీలో ఛాన్స్ ఉండాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి.. మొత్తం 5 మంది ఉన్నాం అని అన్నాడు. అప్పుడు వెంటనే ఫోన్ పెట్టేశా.. తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. ఇంకొక్కసారి ఫోన్ చేస్తే గుడ్డలూడదీసి కొడతా అని గట్టిగా కోప్పడ్డాను.. వెంటనే ఫోన్ పెట్టేశాడు.

ఆ తర్వాత నన్ను ఫోన్ లో ఎవరూ అలాంటి కమిట్ మెంట్స్ అడగలేదు.. డైరెక్టర్ గా అడిగే ఛాన్స్ నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నా.. ఎవరైనా అలా ఫోన్ చేస్తే ఆపరా బాబూ.. నాకు చాలా పనులు ఉన్నాయని జవాబు చెప్పేస్తున్నా. కాస్టింగ్ కౌచ్ అనేది ఒకవైపే ఉండదు.. మనకి ఇష్టం లేకుంటే ఎవరూ మనల్ని టచ్ చేయరు. మనం చనువు ఇస్తేనే మగవాళ్లకి లేని పోని కోరికలు పుట్టి కమిట్ మెంట్స్ అడుగుతుంటారు. కొంతమంది కెరీర్ బాగు కోసం కమిట్ అవుతుంటారు.. వాల్ల గురించి మనం మాట్లాడటం వేస్ట్ అని అన్నారు. మాధవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet