iDreamPost
android-app
ios-app

మిరాయ్ సక్సెస్ అయితే.. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్

  • Published Sep 09, 2025 | 3:49 PM Updated Updated Sep 09, 2025 | 3:49 PM

మిరాయ్ కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంది. హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయినా తేజ సజ్జాకు ఇంకా మరీ అంత ఫ్యాన్ బేస్ లేదు. సో తేజ సజ్జా నుంచి మిరాయ్ అనౌన్స్ చేసినప్పుడు మొదట ఇదేదో చిన్న సినిమా అని అనుకున్నారు.

మిరాయ్ కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంది. హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయినా తేజ సజ్జాకు ఇంకా మరీ అంత ఫ్యాన్ బేస్ లేదు. సో తేజ సజ్జా నుంచి మిరాయ్ అనౌన్స్ చేసినప్పుడు మొదట ఇదేదో చిన్న సినిమా అని అనుకున్నారు.

  • Published Sep 09, 2025 | 3:49 PMUpdated Sep 09, 2025 | 3:49 PM
మిరాయ్ సక్సెస్ అయితే.. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్

మిరాయ్ కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో.. అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంది. హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయినా తేజ సజ్జాకు ఇంకా మరీ అంత ఫ్యాన్ బేస్ లేదు. సో తేజ సజ్జా నుంచి మిరాయ్ అనౌన్స్ చేసినప్పుడు మొదట ఇదేదో చిన్న సినిమా అని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు సంబందించిన ప్రమోషనల్ కంటెంట్ వచ్చేకొద్దీ సినిమా మీద క్రేజ్ పెరుగుతూ పోయింది. కచ్చితంగా విజువల్ వండర్ ట్రీట్ ఉంటుందని ఆడియన్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు.

ఈ మధ్య ఇలాంటి భారీ సెటప్స్ తో చాలానే సినిమాలు వస్తున్నాయి కదా.. మరి మిరాయ్ ప్రత్యేకత ఏంటి అనే విషయానికొస్తే అన్ని సినిమాలలోలానే ఈ సినిమాలో కూడా భారీతనం అయితే ఉంది. కానీ ఖర్చు మాత్రం తక్కువే. సాధారణంగా ఇలాంటి సినిమాలకు కొన్ని వందల కోట్లు ఖర్చుపెడుతూ ఉంటారు. కానీ మిరాయ్ మాత్రం కేవలం 60 కోట్ల లోనే సినిమాను కంప్లీట్ చేసింది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని మేకింగ్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారట. అందుకే అవుట్ పుట్ అంత క్లీన్ గా కనిపిస్తుంది. మొదటి నుంచి పక్కా ప్రణాళికతో పని చేయడం వలెనే ఇదంతా సాధ్యం అయింది.

ఇక ఇప్పుడు వీరికి టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఉన్నా సరే.. ఆ ఆప్షన్ ను చూస్ చేసుకోవడం లేదట మూవీ టీం. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చితే ఆటోమ్యాటిక్ గా కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలు ఇవి రుజువు చేశాయి. ఇలానే ఇప్పుడు ఒకవేళ మిరాయ్ కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి క్వాలిటీ విజువల్ వండర్ ఇచ్చిన సినిమాగా.. మిగిలిన సినిమాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలవడం ఖాయం. ఇక ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.