Swetha
ఈ వారం థియేటర్ లో తేజ సజ్జా మిరాయ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి వీటి సక్సెస్ టాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే కథ కథనం కాకుండా ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాల సక్సెస్ ను డిసైడ్ చేయనుంది.
ఈ వారం థియేటర్ లో తేజ సజ్జా మిరాయ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి వీటి సక్సెస్ టాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే కథ కథనం కాకుండా ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాల సక్సెస్ ను డిసైడ్ చేయనుంది.
Swetha
ఈ వారం థియేటర్ లో తేజ సజ్జా మిరాయ్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కాబట్టి వీటి సక్సెస్ టాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే కథ కథనం కాకుండా ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ కూడా ఈ సినిమాల సక్సెస్ ను డిసైడ్ చేయనుంది. అదే సిజి వర్క్స్ , విఎఫ్ఎక్స్ వర్క్స్ . కిష్కిందపురి సినిమాలో మెయిన్ సీన్స్ అన్ని విఎఫ్ఎక్స్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయట. అలాగే మిరాయ్ లో ఏకంగా 40 శాతం వర్క్ సిజిల మీదే నడిచిందని టాక్. సో ఈ రెండు సక్సెస్ అవ్వాలంటే సిజిలు పర్ఫెక్ట్ గా ఉండాలి.
ఈ మధ్య కాలంలో సిజిల విషయంలో దెబ్బకొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎదో పేరుకి సిజి వర్క్ చేసాం అంటే కుదరదు. ఆ వర్క్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ మాత్రం తేడా కొట్టిన మొదట సినిమా విషయంలో వేలెత్తి చూపించేది ఈ విషయంలోనే. ఎప్పుడైతే సిజిలలో పర్ఫెక్ట్నెస్ కనిపించదో.. ఇక కథ ఇంతా బావున్నా సరే సినిమా మీద ప్రేక్షకుల అభిప్రాయం మారిపోతుంది. ఇక ట్రోలింగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన కంటెంట్ అయితే విజువల్ వండర్ గా అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.
మిరాయ్ లో ఆ శ్రమ ఒకింత ఎక్కువే కనిపిస్తుంది. ఇక కిష్కిందపురి హర్రర్ సినిమానే అయినా కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి వాటికి సిజి లను యూజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు చిత్ర బృందం. ఈ వారం ఈ రెండు సినిమాల విషయంలో సక్సెస్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ మేజర్ గా సిజిలు అయ్యాయి. ఇవి కాకుండా ముందు ముందు రాబోయే రాజాసాబ్ , అఖండ 2 సినిమాలలోనూ ఇవే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక మేకర్స్ ఎంత వరకు ఈ విషయంలో వాళ్ళ 100 % ఎఫర్ట్స్ ను పెడతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.