iDreamPost
android-app
ios-app

Minu Muneer: ప్రముఖ డైరెక్టర్ అశ్లీల చిత్రాలు చూడమన్నాడంటూ నటి సంచలన ఆరోపణలు!

  • Published Sep 30, 2024 | 11:52 AM Updated Updated Sep 30, 2024 | 11:52 AM

Minu Muneer: మలయాళ నటి మిను మునీర్ కొందరు స్టార్‌ డైరెక్టర్స్, నటులపై ఆరోపణలు చేసింది. తాజాగా మలయాళ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

Minu Muneer: మలయాళ నటి మిను మునీర్ కొందరు స్టార్‌ డైరెక్టర్స్, నటులపై ఆరోపణలు చేసింది. తాజాగా మలయాళ డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

  • Published Sep 30, 2024 | 11:52 AMUpdated Sep 30, 2024 | 11:52 AM
Minu Muneer: ప్రముఖ డైరెక్టర్ అశ్లీల చిత్రాలు చూడమన్నాడంటూ నటి సంచలన ఆరోపణలు!

హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఆ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లను బయట పెట్టారు. ఇప్పటికే పలువురు నటులు, ఇతర రంగాలకు చెందిన వారిపై ఆరోపణలు వచ్చాయి. వారు అరెస్ట్ కావడం కూడా జరిగింది. రికార్డింగ్ స్టూడియోలు, ఫిల్మ్ సెట్లు, ఆడిషన్ ఛాంబర్లలో జూనియర్, డైలాగ్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. లైగింక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు ఎడవెల బాబు కూడా అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిలుపై బయటకు వచ్చారు.

ఇదిలా ఉండగా ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ కొందరు స్టార్‌ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ డైరెక్టర్‌పై కూడా మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. బాలచంద్ర మీనన్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సోషల్ మీడియా ద్వారా తనకెదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 2007లో బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. అప్పుడు ఆ గదిలో కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారట. వాళ్ళని చూసి తాను బయటికి వచ్చేశానని తెలిపింది. అయినా కానీ బాలచంద్రన్‌ తనని కూర్చొమని అడిగారని మునీర్ తెలిపింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా మునీర్ ఫేస్‌బుక్‌ ద్వారా సంచలన కామెంట్స్ చేసింది. తనకెదురైన ఇబ్బందుల గురించి చెప్పింది. 2013లో ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు మునీర్ కి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. అప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని చెప్పింది. ఆ వేధింపులు భరించలేక మానసిక క్షోభకి గురయ్యా అని తెలిపింది. వాటికి తట్టుకోలేక మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. దాంతో అక్కడి నుంచి చెన్నై వచ్చేశానని తెలిపింది. తాజాగా మళ్ళీ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. చూడాలి ఈ వివాదంలో మున్ముందు జరుగుతుందో.. ఇక మిను మునీర్ చేసిన ఆరోపణల గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom