iDreamPost
android-app
ios-app

52 ఏళ్లకు 25 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి! తెగని ప్రముఖ నటుడి వివాదం!

  • Author ajaykrishna Published - 01:16 PM, Wed - 19 July 23
  • Author ajaykrishna Published - 01:16 PM, Wed - 19 July 23
52 ఏళ్లకు 25 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి! తెగని ప్రముఖ నటుడి వివాదం!

ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించిన విషయాలు జనాలకు పెద్దగా పట్టకపోయినా.. సినిమాలలో నటించే నటులకు సంబంధించి ఎలాంటి విషయమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. అందులోనూ నటుల పర్సనల్ లైఫ్ విషయాలు మరీ ఆసక్తి రేపుతుంటాయని అంటుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఏయే నటులు ఎవరెవరితో డేటింగ్ లో ఉన్నారు.. ఎవరు లవ్ లో ఉన్నారు? పెళ్లి ఎవరు చేసుకోబోతున్నారు? లాంటి విషయాలపై ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తుంటారు నెటిజన్స్. అలాగని ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వాళ్లు అంతే. అయితే.. కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు ఫ్యాన్స్ కి షాకిస్తుంటాయి. ఎందుకంటే.. ఎక్స్ పెక్ట్ చేసేది ఒకటైతే.. జరిగేది ఒకటి.

ప్రముఖ నటుడు మిలింద్ సోమన్.. పెళ్లి లైఫ్ కూడా అంతే. అంత ఆసక్తికరంగా లేకపోయినా.. ఎప్పుడూ వార్తల్లో మాత్రం నిలుస్తున్నాడు ఈ నటుడు. మోడల్ గా, నటుడుగా మిలింద్ గురించి ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. అంటే.. తెలుగు వాళ్లకు కాస్త తెలియకపోవచ్చు. కానీ.. తమిళ డబ్బింగ్ సినిమాలలో చూసే ఉంటారు. అయితే.. మిలింద్ లైఫ్ చాలామంది మహిళలతో ముడిపడి ఉండటమే అతని పేరు ఎప్పుడు వార్తల్లో ఉండేలా చేస్తోంది. మొదట ఫ్రెంచ్ నటి మైలీన్ జంపానోయిని పెళ్లి చేసుకున్నాడు మిలింద్. ఆమె అతని కంటే 15 ఏళ్లు చిన్నది. కానీ.. ఆమెతో మిలింద్ బంధం ఎక్కువ కాలం సాగలేదు. రెండేళ్లకు విడిపోవాలని నిర్ణయించుకొని 2009లో విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత.. మోడల్ మధు సప్రే, నటి షహానా గోస్వామి, దీపానిత శర్మ, గుల్ పనాగ్ లాంటి చాలామంది బ్యూటీలతో మిలింద్ పేరు గట్టిగా వినిపించింది. కట్ చేస్తే.. అందరికీ షాకిస్తూ మిలింద్ 2018లో అంకితా కున్వర్‌ ని వివాహమాడాడు. ఇక్కడ విషయం ఏంటంటే.. పెళ్లి టైంకి మిలింద్ వయసు 52 ఏళ్లు. అంకిత వయసు 25 ఏళ్లు. అందులోనూ ఇద్దరిది ప్రేమ వివాహం. దీంతో ఇద్దరి వయసుల మధ్య 25 ఏళ్ల వ్యత్యాసం ఉండేసరికి.. అది కాస్త వివాదానికి దారి తీసింది. అప్పటినుండి వీరి ఏజ్ అనేది సోషల్ మీడియాలో.. వారి పర్సనల్ లైఫ్ లో ట్రోల్స్ తెస్తూనే ఉంది. తరచూ ట్రావెలింగ్, ఫిట్ నెస్ వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే.. మిలింద్ ని అంకిత.. అప్పుడప్పుడు పాపాజీ అని పిలిచి ఆటపట్టిస్తుందని మిలింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పెళ్లి జరిగి ఐదేళ్లు అవుతున్నా.. వీరి ఏజ్ ప్రాబ్లెమ్ మాత్రం ఇంకా హైలైట్ అవుతూనే ఉండటం నెటిజన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. మరి మిలింద్, అంకితల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Milind Usha Soman (@milindrunning)