iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి మైండ్ బ్లాక్ ప్లాన్.. రెబల్ స్టార్ తో మెగాస్టార్..?

  • Published Nov 07, 2024 | 12:23 PM Updated Updated Nov 07, 2024 | 12:23 PM

Spirit Movie Updates : ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఆ సినిమాలన్నిటి గురించి ప్రతి రోజు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు రెబెల్ స్టార్ తో మెగాస్టార్ జత కట్టబోతున్నాడట. అదేంటో చూసేద్దాం.

Spirit Movie Updates : ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఆ సినిమాలన్నిటి గురించి ప్రతి రోజు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు రెబెల్ స్టార్ తో మెగాస్టార్ జత కట్టబోతున్నాడట. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 07, 2024 | 12:23 PMUpdated Nov 07, 2024 | 12:23 PM
సందీప్ రెడ్డి మైండ్ బ్లాక్ ప్లాన్.. రెబల్ స్టార్ తో మెగాస్టార్..?

డార్లింగ్ ప్రభాస్ లైన్ అప్స్ అందరిలో ఎగ్జైట్మెంట్ ను పెంచేస్తున్నాయి. ఇప్పుడు వాటిలో మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ అంటే అందరూ స్పిరిట్ అనే చెప్తారు. యానిమల్ లాంటి వైల్డ్ మూవీ తీసిన తర్వాత సందీప్ చేస్తున్న మూవీ ఇది. దీనితో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. రోజు రోజుకి స్పిరిట్ గురించి వినిపిస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. యానిమల్ మూవీ సెట్స్ పై ఉండగానే స్పిరిట్ ను అనౌన్స్ చేశారు. ప్రభాస్ ను మొదటిసారి యూనిఫార్మ్ లో చూపించబోతున్నాం అంటూ స్టార్ట్ చేసిన స్పిరిట్ అప్డేట్స్.. స్పిరిట్ కథ ఏంటి, ప్రభాస్ రోల్ ఏంటి , బడ్జెట్ ఏంటి అనుకునే వరకు వచ్చాయి. వచ్చిన ప్రతి అప్డేట్ కూడా వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ యాడ్ అయింది. అదే రెబల్ స్టార్ తో మెగాస్టార్.అబ్బో ఊహిస్తేనే విజువల్స్ అదిరిపోతున్నాయి కదా. ఇదే నిజమైతే ఇక సీన్ వేరే లెవెల్ ఉంటుంది.

రీసెంట్ గా ప్రభాస్ కల్కిలో ఊహించని క్యామియోస్ ను చూపించాడు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు సందీప్ అంతకుమించిన ప్లాన్ తో ముందుకు వస్తున్నాడు. స్పిరిట్ లో అత్యంత కీలకమైన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడట. గతంలో ఒకటి రెండు సినిమాలలో చిరంజీవి గెస్ట్ రోల్స్ లో కనిపించాడు. కానీ ఈసారి ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ విషయంలో.. ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్ లో డిస్కషన్ జరిగిందట.  గతంలో చాలా సందర్భాల్లో తానూ చిరు అభిమానాన్ని చెప్పుకొచ్చాడు సందీప్. సో ఈ లెక్కన చూస్తే సందీప్ ప్రత్యేకించి చిరు కోసం ఈ స్పెషల్ రోల్ డిసైన్ చేసాడనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగెటివ్ రోల్ లో కనిపించనుందట . ఇక టాలీవుడ్ మెగాస్టార్ తో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా ఓ మెయిన్ రోల్ లో కనిపించబోతున్నారట. దీనితో ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు .

మొన్నేమో ప్రభాస్ కు ఇష్టమైన డైలాగ్ కింగ్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తారన్నారు. ఈరోజు సందీప్ కు ఇష్టమైన చిరు స్పిరిట్ లో నటించనున్నారనే వార్త . ఇలా ఒక్కొక్కటిగా వస్తున్న వార్తలన్నీ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి .సందీప్ సాధ్యమైనంత వరకు అనుభవాలనే కథల రూపంలో చెప్తూ ఉంటాడనే టాక్ ఉంది. అందులో భాగంగానే స్క్రిప్ట్ లో చిరు రోల్ , మమ్ముట్టి రోల్స్ ను యాడ్ చేసాడేమో అనిపిస్తుంది. అసలు ఈ సినిమా సరిగ్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. కానీ ఈలోపు సినిమా మీద  బజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel