iDreamPost
android-app
ios-app

కొత్త ప్రయాణం మొదలైంది.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీజ కొణిదెల

  • Published Apr 22, 2024 | 11:17 AM Updated Updated Apr 22, 2024 | 11:17 AM

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు గురించి అందరికీ తెలసిందే. ఈమె తన భర్త కళ్యాణ్ దేవ్ కు దూరంగా తన ఇద్దరి పిల్లలతో ఒంటరి జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే తాజాగా మెగా డాటర్ ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న అంటూ సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది. ఇంతకి అదేమిటంటే..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు గురించి అందరికీ తెలసిందే. ఈమె తన భర్త కళ్యాణ్ దేవ్ కు దూరంగా తన ఇద్దరి పిల్లలతో ఒంటరి జీవితాన్ని ప్రారంభిస్తుంది. అయితే తాజాగా మెగా డాటర్ ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న అంటూ సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Apr 22, 2024 | 11:17 AMUpdated Apr 22, 2024 | 11:17 AM
కొత్త ప్రయాణం మొదలైంది.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీజ కొణిదెల

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం విశేషం. ఈ క్రమంలోనే మెగా కుటుంబంలో చిరంజీవి తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక మెగా కుటుంబంలో ఆడపడుచులైన సుస్మిత, నిహారికలు నిర్మాతగా, నటిగా తమ సత్తాను చాటుతున్న విషయం తెలిసిందే. కానీ, మెగస్టార్ చిన్న కూతురు శ్రీజ మాత్రం చాలా డిఫరెంట్. ఈమెకు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా దూరంగా ఉటుంది. అలాగే శ్రీజ తన వ్యక్తిగత జీవితంలో కూడా భర్తకు దూరమై వేరొగా తన ఇద్దరి పిల్లలతో ఒంటరి ప్రయాణం కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఈ మెగా డాటర్.. ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న అంటూ సోషల్ మీడియాలో ఓ గుడ్ న్యూస్ ను తెలియజేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మెగా డాటర్ శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఇద్దరి పిల్లలతో చిరంజీవి ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, తన భర్త కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు విబేధాలు కారణంగా.. విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత వరకు వీరిద్దరూ కూడా విడాకులపై స్పందించలేదు. ఇక భర్తతో దూరమైన శ్రీజ ఒంటరిగా జీవితాన్ని కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శ్రీజ ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకి అదేమిటంటే.. మెగా డాటర్ శ్రీజ ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టింది. కాగా, దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కొత్త ప్రయాణం మొదలైంది అంటూ శ్రీజ రాసుకొచ్చింది. ఇంతకీ శ్రీజ ఏ వ్యాపారంలోకి అడుగుపెట్టిందంటే.. ఆమె హైదరాబాద్ లోని  స్టూడియో అనంత పేరుతో ఒక ఫిట్ నెస్ సెంటర్ ను ప్రారంభించింది .

Sreeja Konidela who gave good news

ఇందులో మనసుకు, శరీరానికి ప్రశాంతత కలిగించేలా జిమ్, యోగా, ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయట. అయితే ఈ బిజినెస్  ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కాసాండ్రా, బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి ఉండడం గమన్హారం.  ఈ సందర్భంగా ఫిట్‌నెస్ సెంటర్‌లో తను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని శ్రీజ తన ఇన్ స్టాలో స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. కాగా, ఈ సెంటర్ లో జిమ్ యోగా లాంటివి ఉంటాయని సమాచారం.  ఇక తనకు తెలిసిన కొంత మందితో ఈ ఫిట్ నెస్ స్టూడియోను శ్రీజ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి, మెగా డాటర్ శ్రీజ కొణిదెల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş