iDreamPost
android-app
ios-app

మంచు మనోజ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక

  • Published Dec 06, 2023 | 5:20 PM Updated Updated Dec 06, 2023 | 5:24 PM

మంచు మనోజ్ మాటలకు ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం ప్రోమో ఈవెంట్ లో మనోజ్ తనపై చూపించిన ప్రేమకు భావోద్వేగానికి గురయ్యింది.

మంచు మనోజ్ మాటలకు ఆయన భార్య కన్నీళ్లు పెట్టుకుంది. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం ప్రోమో ఈవెంట్ లో మనోజ్ తనపై చూపించిన ప్రేమకు భావోద్వేగానికి గురయ్యింది.

  • Published Dec 06, 2023 | 5:20 PMUpdated Dec 06, 2023 | 5:24 PM
మంచు మనోజ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ హోస్ట్ గా సరికొత్త టాక్ షో ప్రారంభం కాబోతోంది. ఆ ప్రోగ్రామే ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ఈ షో డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. ప్రత్యేకంగా తన భార్య మౌనిక గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె భావోద్వేగానికి గురయ్యింది. భర్త తన గురించి ఆ వేదికపై గొప్పగా చెప్తుంటే ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

మనోజ్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మళ్లీ వస్తున్నాను అని మంచు మనోజ్ అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చూపించే ప్రేమ మాత్రం తగ్గలేదని తెలిపారు. వాళ్లిచ్చిన ధైర్యమే నన్ను మళ్లీ ఈ వేదికపై నిలబెట్టేలా చేసింది. వాళ్లు చూపించే ప్రేమ నాపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. వాళ్లు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. నేను మౌనికతో లవ్ లో పడ్డాకే ఆ ప్రేమ విలువ తెలిసిందని తెలిపారు. అప్పటి వరకు తనకు కళ్లు మూసుకుపోయాయని అందుకు అభిమానులు క్షమించాలని కోరారు. ఇక మంచు వారబ్బాయి తన భార్య గురించి గర్వంగా చెప్తుంటే ఉప్పొంగిపోయింది. దీంతో మౌనిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం ప్రోగ్రాంలో విన్ అయిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ షోతో అందర్ని ఎంటర్ టైన్ చేసేందుకు మంచు మనోజ్ సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ మళ్లీ నటించ లేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే వాట్ ది ఫిష్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetganobet girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom