iDreamPost
android-app
ios-app

మత్తు వదలరా 2 టీజర్ రిలీజ్.. టాలీవుడ్ మొత్తాన్ని విచ్చలవిడిగా వాడేశారు!

  • Published Aug 30, 2024 | 11:46 AM Updated Updated Aug 30, 2024 | 11:46 AM

Mathu Vadalara 2 Teaser Review In Telugu: మత్తు వదలరా.. టాలీవుడ్ లో ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

Mathu Vadalara 2 Teaser Review In Telugu: మత్తు వదలరా.. టాలీవుడ్ లో ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.

  • Published Aug 30, 2024 | 11:46 AMUpdated Aug 30, 2024 | 11:46 AM
మత్తు వదలరా 2 టీజర్ రిలీజ్.. టాలీవుడ్ మొత్తాన్ని విచ్చలవిడిగా వాడేశారు!

టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త సినిమాల కంటే.. సీక్వెల్స్ కోసమే ఎక్కువ ఎదురుచూస్తున్నారు. అలాంటి సీక్వెల్ లిస్ట్ లోకి సడెన్ గా వచ్చి సర్ ప్రైజ్ చేసిన చిత్రమే మత్తు వదలరా 2. ఈ రితేశ్ రానా సీక్వెల్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పుడు టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేరు. అలాగే ఈ టీజర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తుంది అనడంలో సందేహం లేదు. మత్తు వదలరా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ని సమపాళ్లలో వాడారు. కానీ, ఈ సీక్వెల్ లో మాత్రం యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్నింటిని కూసింత ఎక్కువగానే వాడేశారు. మరి.. ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది అని అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని చెబుతూ ఈ టీజర్ ని స్టార్ట్ చేశారు. కానీ, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగిపోయింది. దానికి తగినట్లుగానే పార్ట్ 2కి సంబంధించి పరిధిని కూడా పెంచేశారు. మొదటి పార్ట్ లో డెలివరీ బాయ్స్ గా చేసిన శ్రీసింహా, సత్య.. ఇప్పుడు స్పెషల్ ఏజెంట్స్ అయిపోయారు. ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారో? ఎవరైతే ఈ దందా చేస్తున్నారో వారిని పట్టుకునే H.E. టీమ్ గా ఏర్పాటు చేశారు. ఈ టీమ్ లో సునీల్, హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా కూడా ఉంటారు. ఇంక హీరో, సత్య మధ్య జరిగే సరదా సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసారి వాటి డోస్ పెంచేశారు.

ఈ టీజర్ చూసిన తర్వాత బాగా అర్థమైన విషయం ఏంటంటే.. సీక్వెల్ లో కంటెంట్ మొత్తం మీమ్స్, వైరల్ కంటెంట్ మీదే ఉంటుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ని స్పెషల్ గా దానికోసమే డిజైన్ చేసినట్లు ఉన్నారు. ఓపెనింగ్ లోనే.. క్రిస్టియానో రొనాల్డోని రివర్స్ లో ఇమిటేట్ చేశాడు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టచ్ చేశారు. ఇంకా ఒక సీన్ లో ప్రముఖ టాలీవుడ్ నటిని కూడా మాక్ చేసినట్లు కనిపించింది. ఇలా చెప్పుకుంటే పోతే.. చాలానే ఎక్సెపెరిమెంట్లు చేసినట్లు ఉన్నారు. మొత్తానికి నవ్వించడానికి అయితే ఫిక్స్ అయిపోయారు. ట్విస్ట్ ఏంటంటే.. స్పెషల్ ఏజెంట్ అయినా కూడా సత్య ఇంకా దొంగతనాలు మానకపోవడం. మరి.. మత్తు వదలరా 2 టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş