iDreamPost
android-app
ios-app

మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

  • Published Aug 26, 2024 | 6:45 PM Updated Updated Aug 26, 2024 | 6:45 PM

Mathu Vadalara 2 Release Date: టాలీవుడ్ లో మత్తు వదలరా సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Mathu Vadalara 2 Release Date: టాలీవుడ్ లో మత్తు వదలరా సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

  • Published Aug 26, 2024 | 6:45 PMUpdated Aug 26, 2024 | 6:45 PM
మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

టాలీవుడ్ లో చాలానే సినిమాలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అభిమానులను అల్లాడించేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కచ్చితంగా ‘మత్తు వదలరా’ సినిమా ఉంటుంది. శ్రీ సింహాకి హీరోగా ఈ సినిమాతో చాలా మంచి మార్కులు పడ్డాయి. అలాగే కమెడియన్ సత్య కూడా ఈ సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాడు. ఇందులో వచ్చే ట్విస్టులకు తెలుగు ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఆ సినిమాకి సీక్వెల్ కోసం చానాళ్లుగా వెయింటింగ్ కూడా. ఆ తరుణం రానే వచ్చింది. మత్తు వదలరా 2కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఒక పోస్టర్ రిలీజ్ చేసి.. రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

డిసెంబర్ 25, 2019లో విడుదలైన మత్తు వదలరా సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే సీక్వెల్ కోసం వెయిట్ కూడా చేస్తున్నారు. అలాంటి కల్ట్ ఫ్యాన్స్ కి మైత్రీ మూవీ మేకర్స్ ఆ శుభవార్తను చెప్పేశారు. సెప్టెంబర్ 13న మత్తు వదలరా చిత్రం థియేటర్లలో విడుదల అవుతుందని ప్రకటించారు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూశాక మీకు కచ్చితంగా సినిమా మీద అంచనాలు భారీగానే పెరిగిపోతాయి. ఈ పోస్టర్ లో శ్రీ సింహా, సత్య ఉన్నారు. వాళ్ల చేతుల్లో తుపాకులు ఉన్నాయి. అలాగే వీళ్ల మీద కాల్పులు జరుగుతున్నాయి. సత్య అయితే గాల్లోకి ఎగిరి మరీ షూట్ చేస్తున్నాడు. బ్యాగ్రాడ్ పో హై ఎమర్జెన్సీ టీమ్ అని ఒక ఆర్చ్ కూడా ఉంది.

ఈ పోస్టర్ ని.. అందులో ఉన్న డీటెయిల్స్ ని చూసిన తర్వాత సినిమా పరిధిని పెంచేశారు అని కచ్చితంగా అర్థమైపోతోంది. ఫస్ట్ హాఫ్ లో కథను చాలా లైట్ గా టచ్ చేశారు. శ్రీసింహా, సత్య, నరేష్ అగస్త్యల క్యారెక్టర్లను ఎలివేట్ చేయడం, వారి కష్టాలను చూపించడంతోనే సరిపోయింది. అసలు కథ రివీల్ అయ్యాక ట్విస్టుతో ముగించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ ని అంతకంటే పకడ్బందీగా ప్లాన్ చేశారు అనిపిస్తోంది. అలాంటి అంచనాలకు తగినట్లుగానే పోస్టర్ అయితే ఉంది. అలాగే శ్రీసింహా, సత్యల క్యారెక్టర్స్ పరిధిని కూడా పంచేసి వీళ్ల మీదకు మాఫియాని పంపినట్లు ఉన్నారు. ఈ డ్రగ్స్, గన్స్, షూట్ అవుట్స్, ఛేజింగ్లు చూస్తుంటే రితేశ్ రానా గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తోంది. మరి.. మత్తు వదలరా సీక్వెల్ పోస్టర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sri Simha Marakathamani (@simhakoduri)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom