iDreamPost
android-app
ios-app

మారుతి మాస్టర్ ప్లాన్.. రాజాసాబ్ మూవీ లో అన్ని ట్విస్టులా..!

  • Published Oct 28, 2024 | 1:37 PM Updated Updated Oct 28, 2024 | 1:37 PM

Rajasaab Movie Update: పక్కా ప్లానింగ్ తో డార్లింగ్ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు అందరు రాజాసాబ్ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Rajasaab Movie Update: పక్కా ప్లానింగ్ తో డార్లింగ్ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు అందరు రాజాసాబ్ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 28, 2024 | 1:37 PMUpdated Oct 28, 2024 | 1:37 PM
మారుతి మాస్టర్ ప్లాన్.. రాజాసాబ్ మూవీ లో అన్ని ట్విస్టులా..!

ఓ ప్లానింగ్.. ఓ విజన్.. ఓ పద్దతి.. ఇప్పుడు ఈ డైలాగ్ వింటే గుర్తొచ్చే హీరో ప్రభాస్. ప్రస్తుతం పక్కా ప్లానింగ్ తో డార్లింగ్ దూసుకుపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలకు సంబంధించిన ఫైనల్ డేట్స్ ప్రభాస్ చేతిలో ఉన్నాయి. డార్లింగ్ దూకుడికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ షూట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తర్వాత.. రాజాసాబ్ సినిమా మీద అందరికి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రభాస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ ఇంకాస్త ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

రాజాసాబ్ నుంచి ఫస్ట్ లుక్ ను రివీల్ చేయగానే.. కొందరిలో ఆనందం , మరికొందరిలో అనుమానం. మోషన్ పోస్టర్ భలే షాకింగ్ గా ఉందంటూ కొందరు ప్రశంసించగా.. ఇదేంటి అంటూ మరి కొందరు విమర్శించారు. ఇలాంటి ట్రోలింగ్స్ అనేవి సర్వసాధారణం. అయితే ఇప్పుడు వారందరిని సైలెంట్ చేసే విధంగా ఈ కథ ఉండబోతున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద.. కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది. పైగా ఈ మూవీ హర్రర్ జోనర్ లో వస్తుండడంతో.. నార్త్ లో కూడా క్రేజి బిజినెస్ ను లాక్ చేసుకునేలా కనిపిస్తుంది. ఇక మూవీ విషయానికొస్తే  తాత , మనవడు , దెయ్యం గెటప్స్ లో ప్రభాస్ ఉంటాడని.. మూవీ గురించి రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ బజ్ ఏంటంటే .. రాజాసాబ్ మూవీ చంద్రముఖి తరహాలో ఉంటుందని ఇన్సైడ్ లీక్. తాత పాత్రలో పోషిస్తున్న ప్రభాస్ , సంజయ్ దత్ ల మధ్య జరిగే సన్నివేశాలు.. ఫ్లాష్ బ్యాక్ లో రాజాసాబ్ ఎపిసోడ్ కు దారి తీస్తాయని.. అంతే కాకుండా అవి రజినీకాంత్ లకలకలక కు మించిన మ్యానిరిజం తో.. గూస్బంప్స్ తెప్పిస్తాయనే టాక్ నడుస్తుంది.

ఇక ఇంకో పాత్రలో యంగ్ లుక్ లో కనిపించబోతున్న ప్రభాస్ సెకండ్ హాఫ్ లో కనిపిస్తాడని.. ఓల్డ్ గెటప్ లో ఉన్న ప్రభాస్ అసలైన రాజాసాబ్ అని ఇలా మొత్తం ట్విస్ట్ లతో ఉంటుందని చెబుతున్నారు. దీనితో , ఉండొచ్చు కానీ మరీ ఇన్ని ట్విస్ట్ ల.. అసలు ఏం ప్లాన్ చేసావ్ మారుతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇవన్నీ చూస్తుంటే దర్శకుడు ప్రభాస్ ను ఎదో కొత్తగా చూపించే ప్లాన్ లో ఉన్నాడనిపిస్తుంది. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. దాదాపు ఫిబ్రవరి కి ఫస్ట్ కాపీ రెడీ చేసే టార్గెట్ తో ఉన్నారు మేకర్స్. హర్రర్ జానర్ అయినా కూడా.. VFX విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడడం లేదు. ఇక మారుతి చేసే మ్యాజిక్ ను తెరపై చూడడం మాత్రమే బ్యాలెన్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş