Swetha
ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అలాగే ప్రభాస్ డ్యాన్స్ లు వేసేది తక్కువే కానీ.. దానికి కూడా కాస్త క్రేజ్ ఉంది. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ లో ఈ వెర్షన్ ఏ కనిపించలేదు. సినిమా కథలలో ఎక్కడా కూడా డ్యాన్స్ లకు స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కానీ సలార్ దగ్గరనుంచి మళ్ళీ ఊపందుకున్నాడు.

ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. అలాగే ప్రభాస్ డ్యాన్స్ లు వేసేది తక్కువే కానీ.. దానికి కూడా కాస్త క్రేజ్ ఉంది. అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ లో ఈ వెర్షన్ ఏ కనిపించలేదు. సినిమా కథలలో ఎక్కడా కూడా డ్యాన్స్ లకు స్కోప్ లేకుండా పోయింది. ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కానీ సలార్ దగ్గరనుంచి మళ్ళీ ఊపందుకున్నాడు. ఇక ఆ తర్వాత కల్కి ఎలాంటి సక్సెస్ ను అందించిందో తెలియనిది కాదు. కానీ వీటిలో ఎక్కడా కూడా డార్లింగ్ స్టెప్పులకు స్కోప్ లేకుండా పోయింది. దీనితో డై హార్ట్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉన్నారు. సినిమా హిట్స్ అవుతున్న ఆనందంలో వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే . ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాలో.. చాలానే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లు ఉన్నాయట. రాజాసాబ్ నుంచి అఫీషియల్ అప్డేట్స్ ఏమి రావడం లేదులే కానీ.. ఎవరు మాట్లాడినా కూడా చాలా గొప్పగా చెబుతున్నారు. ఎప్పుడు రాజాసాబ్ టాపిక్ వచ్చినా ఎదో ఒక హింట్ వస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మారుతి సినిమాలో డ్యాన్స్ నెంబర్ గురించి మాట్లాడారు. డార్లింగ్ రాజాసాబ్ లో అదిరిపోయే డ్యాన్సులు వేసినట్టు హింట్ ఇచ్చారు.
ఇందులో ఓ పాట కోసం టాప్ కొరియాగ్రాఫర్ మ్ రక్షిత్‌ను ఎంచుకున్నట్లు మారుతి చెప్పాడు. ప్రభాస్ ను ఏ రకంగా చూపించాలనే విషయంలో లక్ష మంది ఆకలిలో తన ఒక్కడికే ఉందని.. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఏరికోరి రక్షిత్ ను తీసుకున్నానని.. తన కొరియోగ్రఫిలో డార్లింగ్ డ్యాన్సులు అదిరిపోయాయని చెప్పుకొచ్చాడు. ఇదే సాంగ్ ను రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రూపంలో రిలీజ్ చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.