iDreamPost
android-app
ios-app

మరో వివాదంలో మన్సూర్‌ అలీ.. ఈ సారి ఏకంగా దేశాన్ని..

  • Published Nov 21, 2023 | 12:13 PM Updated Updated Nov 21, 2023 | 12:13 PM

మన్సూర్‌ అలీ ఖాన్‌ వరుస వివాదాలకు కేరాఫ్‌ అ‍డ్రస్‌గా మారారు. త్రిషపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరో కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది..

మన్సూర్‌ అలీ ఖాన్‌ వరుస వివాదాలకు కేరాఫ్‌ అ‍డ్రస్‌గా మారారు. త్రిషపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మరో కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది..

  • Published Nov 21, 2023 | 12:13 PMUpdated Nov 21, 2023 | 12:13 PM
మరో వివాదంలో మన్సూర్‌ అలీ.. ఈ సారి ఏకంగా దేశాన్ని..

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన విచిత్ర ప్రవర్తనతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించే అవకాశం రావటంతో సంతోషించానని అన్నారు. ఆ సినిమాలో త్రిషతో రేప్‌ సీన్‌ ఉంటుందని ఆశించినట్లు తెలిపారు. కానీ, లియోలో అలాంటి సీన్లు ఏమీ లేనందుకు బాధపడ్డానని అన్నారు. తనకు 109 సినిమాలో రేప్‌ సీన్లు చేసిన అనుభవం ఉందంటూ వెకిలిగా మాట్లాడారు.

ఈ వ్యాఖ్యల తాలూకా వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై త్రిష స్పందించారు. మన్సూర్‌ అలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల అలాంటి నీచులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే పరిస్థితి తనకు రాలేదని అన్నారు. ఇకపై కూడా అతడితో కలిసి నటించనని తేల్చిచెప్పారు. మన్సూర్‌ లాంటి వాళ్లు మనుష జాతికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మండిపడ్డారు. త్రిషతో పాటు చిత్ర పరిశ్రమనుంచి చాలా మంది మన్సూర్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఉన్నారు.

త్రిషపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మన్సూర్‌ రోజా పేరును కూడా వాడారు. దీంతో ఆమె కూడా మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు ఉండాలన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడే మగాళ్లు భయపడతారని అన్నారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి చెప్పనక్కర్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌, హీరోయిన్‌ మాళవిక మోహన్‌లు కూడా స్పందించారు.

ఇక, అసలు విషయానికి వస్తే.. మన్సూర్‌ మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా, త్రిష పై వ్యాఖ్యల వివాదంపై ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సమావేశం అయినపోయిన తర్వాత జాతీయ గీతం పాడారు. అయితే, జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. మధ్య మధ్యలో వింత చేష్టలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, గతంలో స్టార్‌ హీరోయిన్‌ తమన్నాపై కూడా మన్సూర్‌ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. జైలర్‌ సినిమాలో ఆమె డ్యాన్స్‌ దారుణంగా ఉందని అన్నారు. కాళ్ల మధ్యలో చేతులు పెట్టుకుంటూ అసభ్యంగా డ్యాన్స్‌ చేసిందని అన్నారు. మరి, మన్సూర్‌ వరుస వివాదాల్లో చిక్కుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom