iDreamPost
android-app
ios-app

ఆ హీరోయిన్ ఛాతిపై గట్టిగా గుద్దింది.. హాస్పిటల్ లో చేర్పించారు : శ్రద్దా దాస్

  • Published Jan 27, 2024 | 10:40 PM Updated Updated Jan 28, 2024 | 11:13 AM

దేశంలో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 17 నడుస్తుంది. రేపు ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది.

దేశంలో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 17 నడుస్తుంది. రేపు ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది.

  • Published Jan 27, 2024 | 10:40 PMUpdated Jan 28, 2024 | 11:13 AM
ఆ హీరోయిన్ ఛాతిపై గట్టిగా గుద్దింది.. హాస్పిటల్ లో చేర్పించారు : శ్రద్దా దాస్

ఇండియన్ టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకొని 17వ సీజన్ నడుస్తుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ మంచి సక్సెస్ సాధించడంతో ఇతర భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తో పాటు మరికొన్ని భాషల్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగు లో కింగ్ నాగార్జున్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల పూర్తి అయ్యింది. బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 17 ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. అయితే ఈసారి కప్ కొట్టే రేసులో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తాజాగా ఈ అమ్మడి గురించి నటి శ్రద్దా దాస్ గతంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగు, హిందీ చిత్రాల్లో గ్లామర్ షోతో అలరించిన బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు లో ఇటీవల పలు షోల్లో జడ్జీగా వ్యవహరిస్తుంది. గతంలో మన్నార్ చోప్రాతో శ్రద్దా దాస్ కి గొడవ జరిగింది. బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా ఆ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ మన్నార చోప్రా. 2014 లో తెలుగు లో ‘ప్రేమ గీమా జాన్తా నై’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాదిలో బాలీవుడ్ లో ‘జిద్’మూవీలో నటించింది. ఆ మూవీలో హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ కూడా నటించింది. అయితే షూటింగ్ సమయంలో శ్రద్దా దాస్, మన్నార్ చోప్రాకు మధ్య గొడవలు జరిగాయట. కొన్ని సన్నివేశాల్లో మన్నారా నిజంగానే కొట్టేసిందని శ్రద్దా దాస్ వాపోయింది.

శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. ఓ సీన్ లో మెట్లపై నుంచి నన్ను తోయాలి.. డైరెక్టర్ నెమ్మదిగా నెట్టాలని చెప్పినప్పటికీ మన్నార్ గట్టిగా తోసేసింది.. దాంతో కిందపడి నాకు దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత మరో సీన్ లో నన్ను కొట్టే సీన్ ఉంది.. నెమ్మదిగా కొట్టాలని నేను చెప్పినప్పటికీ మన్నార్ గట్టిగా కొట్టడం మొదలు పెట్టింది. నేను ఎంతగా ఆపాలని చూసినా కుదర్లేదు.. మరోవైపు డైరెక్టర్ కట్ అని చెప్పినా వినలేదు. చివరికి ఆపింది.. అప్పటికే నా శరీరంపై 30 చోట్ల గాయాలు అయ్యాయి. మరో సీన్ లో నా ఛాతిపై నెమ్మదిగా పంచ్ ఇవ్వాలి.. డైరెక్టర్ ఆ సీన్ వివరిస్తుంటే అన్నింటికీ సరే అంది. తీరా సీన్ చేసేటపుడు నిజంగానే గట్టిగా గుద్దేసింది.. మరోసారి డమ్మీ స్ట్రిక్ బదులు నిజమైన కర్రతో కొట్టింది. అప్పుడు నా కుడి కంటికి గాయమై గట్టిగా అరిచాను. వెంటనే టీమ్ నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు అంటూ గతంలో చెప్పింది. తాజాగా ఈ గొడవపై శ్రద్దా దాస్ ని ప్రశ్నించగా.. ఆ విషయాలు మాట్లాడానికి నిరాకరించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom