వివాదంలో మంజుమ్మల్ బాయ్స్ నిర్మాతలు.. ఆ హీరోకు ED నోటీసులు

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ మలయాళ మూవీ విడుదలైన ప్రతి ఇండస్ట్రీ బ్రహ్మరథం పట్టింది. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. ఈ మలయాళ మూవీ విడుదలైన ప్రతి ఇండస్ట్రీ బ్రహ్మరథం పట్టింది. ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

ఈ ఏడాది మలయాళ సినిమాలు చూపించిన హవా అంతా ఇంతా కాదు.. మమ్ముట్టి.. పృధ్వీ రాజ్ సుకుమారన్ వంటి స్టార్ హీరోల సినిమాలే కాకుండా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. వాటికి వచ్చిన కలెక్షన్లు చూసి సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. అందులో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి విదితమే. కేవలం రూ. 20 కోట్లతో సినిమాను రూపొందిస్తే.. రూ. 250 కోట్లను వసూలు చేసింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించారు. చిదంబరం దర్శకుడు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషించారు.

మలయాళంలో ఫిబ్రవరిలో విడుదల కాగా, మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో డబ్ చేసి.. ఏప్రిల్‌లో రిలీజ్ చేశారు. నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చి పెట్టింది మంజుమ్మల్ బాయ్స్. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇటీవల వివాదంలో చిక్కుకున్న సంగతి విదితమే. మంజుమ్మల్ బాయ్స్ పెట్టుబడిదారుడు సిరాజ్ వలియతార హమీద్.. తనను మోసం చేశారంటూ ప్రొడ్యూసర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినిమాలో తన పెట్టుబడికి ప్రతిఫలంగా సినిమా మొత్తం లాభాల్లో 40 శాతం తనకు వాటా ఇస్తామని పరవ ఫిల్మ్స్ వ్యవస్థాపకులు సౌబిన్ షాహీర్, బాబు షాహీరో, షాన్ ఆంటోనీలు హామీ ఇచ్చారని, ఆ తర్వాత మాట తప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.

ఈ క్రమంలో నిర్మాతలైన సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే నిర్మాతల్లో ఒకరైన షాన్ ఆంటోనీని ఇప్పటికే ప్రశ్నించినట్లు తెలుస్తుంది. త్వరలో ఈడీ విచారణకు మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. ఇక కథ విషయానికే వస్తే. 2006లో 10 మంది మంజుమ్మల్ బాయ్స్.. తమిళనాడులోని గుణ కేవ్స్ చూసేందుకు వెళతారు. గుహలోకి దిగగా.. అందులో సుభాష్ అనే ప్రెండ్ ఊహించని విధంగా లోయలోకి పడిపోతాడు. అతడ్ని మిగిలిన స్నేహితులు బయటకు ఎలా తీసుకువచ్చారన్నదే మిగిలిన కథ.  కాగా, నిర్మాతల్లో ఒకరైన సౌబిన్ ఈ సినిమాలో మెయిన్ హీరో కావడం విశేషం. కుట్లన్ పాత్రలో కనిపిస్తున్నాడు. లోయలో పడిపోయిన స్నేహితుడ్ని కాపాడేది ఇతడే. ఈ సినిమా చూడకుంటే.. ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తుంది వాచ్ అండ్ ఎంజాయ్.

Show comments