Mani Sharma- KCR Dialogue- Maar Muntha Song: మార్ ముంత.. చోడ్ చింత సాంగ్ లో KCR డైలాగ్ పెట్టడంపై మణిశర్మ క్లారిటీ!

మార్ ముంత.. చోడ్ చింత సాంగ్ లో KCR డైలాగ్ పెట్టడంపై మణిశర్మ క్లారిటీ!

Mani Sharma- KCR Dialogue In Mar Muntha Chod Chinta Song: డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబధించి ఇటీవలే మార్ ముంత సాంగ్ వచ్చింది. అయితే దానిలో కేసీఆర్ డైలాగ్ వాడటంపై వ్యతిరేకత వచ్చింది. దానిపై మణిశర్మ క్లారిటీ ఇచ్చారు.

Mani Sharma- KCR Dialogue In Mar Muntha Chod Chinta Song: డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబధించి ఇటీవలే మార్ ముంత సాంగ్ వచ్చింది. అయితే దానిలో కేసీఆర్ డైలాగ్ వాడటంపై వ్యతిరేకత వచ్చింది. దానిపై మణిశర్మ క్లారిటీ ఇచ్చారు.

ఇస్మార్ట్ శంకర్ తో బిగ్గెస్ట్ హిట్టు కొట్టి.. ఇప్పుడు అంతకు మించిన ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కలిసి డబుల్ ఇస్మార్ట్ తో వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల మార్ ముంత.. చోడ్ చింత అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఐటమ్ సాంగ్ అని.. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్ ని వాడటంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చాలా మంది ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఈ సాంగ్ లో అసలు కేసీఆర్ డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది? అసలు ఆ పాట ఐటమ్ సాంగా? కాదా? అనే విషయాలపై డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సమాధానం చెప్పారు.

ఈ సాంగ్ లిరిక్స్ కి, మ్యూజిక్ కి, రామ్ పోతినేని స్టెప్పులకు మంచి అప్లాజ్ లభించింది. కానీ, కేసీఆర్ అభిమానుల నుంచి మాత్రం వ్యతిరేకత వచ్చింది. అసలు అలా ఎలా ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ని వాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆ సాంగ్ అంతా కల్లు కాంపౌండ్ లోనే ఉంటుంది. మార్ ముంత.. చోడ్ చింత అంటూ తాగడాన్ని ప్రోత్సహించే సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ అలా ఎలా వాడతారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యతిరేకత కాస్త గట్టిగానే వచ్చింది. సాంగ్ ఎంత బాగున్నా కూడా ఈ నెగిటివ్ కామెంట్స్ కాస్త డ్యామేజ్ చేసేలాగే అనిపించింది. అందుకే ఆ విమర్శలు, వ్యతిరేకతకు స్వయంగా మణిశర్మ సమాధానం చెప్పారు.

మార్ ముంత.. చోడ్ చింత సాంగ్ టీమ్ ఈ చిన్న చిట్ చాట్ నిర్వహించారు. కేసీఆర్ చెప్పిన ‘ఏం చేద్దాం అంటావ్ మరి’ అనే డైలాగ్ అంశాన్ని కూడా టచ్ చేశారు. మణిశర్మ మాట్లాడుతూ.. అసలు అది ఐటమ్ సాంగ్ కాదు అని క్లారిటీ ఇచ్చారు. అది హీరో- హీరోయిన్ మధ్య వచ్చే డ్యూయెట్ అని చెప్పుకొచ్చారు. అలాగే లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కూడా ఈ సాంగ్ లిరిక్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇది పక్కా మీమ్ బేస్డ్ సాంగ్ అని స్పష్టం చేశారు. సాంగ్ స్టార్టింగ్ , మధ్యలో, చివర్లో కూడా మీమ్స్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ఆ డైలాగ్ ని మీమ్స్ నుంచి తీసుకున్నదే అని చెప్పారు. ఆయన అంటే తమకు ఎంతో అభిమానం అని మణిశర్మ బలంగా చెప్పారు. ఆయన డైలాగ్ ని వాడటంలో ఎక్కడా కూడా కించపరిచే ఉద్దేశం లేదు అని స్పష్టం చేశారు. కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం మాత్రమే అని.. ఎవరూ తప్పుగా తీసుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఇంక డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. మరి.. మార్ ముంత.. చోడ్ చింత సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ వాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments