iDreamPost
android-app
ios-app

నాగచైతన్య- శోభితల జాతకం చెప్పడంపై మంచు విష్ణు సీరియస్! మహిళా కమీషనర్‌కి ఫిర్యాదు!

  • Published Aug 12, 2024 | 5:27 PM Updated Updated Aug 12, 2024 | 5:37 PM

జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ తెచ్చుకున్నాడు వేణు స్వామి. అయితే ఈ మధ్య కొన్ని జాతకాలు బెడిసి కొట్టడంతో తాను ఆస్ట్రాలజీ చెప్పనంటూ తెగేసి చెప్పిన ఆయన చైతూ-శోభిత నిశ్చితార్థం చేసుకోగానే..

జ్యోతిష్యం, హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ తెచ్చుకున్నాడు వేణు స్వామి. అయితే ఈ మధ్య కొన్ని జాతకాలు బెడిసి కొట్టడంతో తాను ఆస్ట్రాలజీ చెప్పనంటూ తెగేసి చెప్పిన ఆయన చైతూ-శోభిత నిశ్చితార్థం చేసుకోగానే..

  • Published Aug 12, 2024 | 5:27 PMUpdated Aug 12, 2024 | 5:37 PM
నాగచైతన్య- శోభితల జాతకం చెప్పడంపై మంచు విష్ణు సీరియస్! మహిళా కమీషనర్‌కి ఫిర్యాదు!

సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి, అలాగే హీరోయిన్లతో పూజలు చేయించి ఫేమ్ అయ్యాడు వేణు స్వామి. ఆయన ఈ మధ్యకాలంలో చెప్పిన జోస్యం బెడిసి కొట్టడంతో ఇక జీవితంలో జాతకాలు చెప్పనంటూ తెగేసి చెప్పాడు. అయితే నాగ చైతన్య- శోభితా దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ చేసుకోగానే.. వీరి జాతకం చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇద్దరు కూడా జీవితంలో కలిసి ఉండరూ అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. వేణు స్వామిని తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి వేణు స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చిక్కుల్లో పడ్డారు వేణు స్వామి. మరోవైపు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా వేణు స్వామికి ఫోన్ చేసి.. ఈ విషయంలో ఆయన వివరణ కోరారు. ఇదే విషయాన్ని వేణు స్వామి ఓ వీడియోలో తెలిపారు.

“మూడురోజుల క్రితం నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకాన్ని నేను విశ్లేషించాను. దానిపై తీవ్రమైన డిబేట్స్ సాగుతున్నాయి. నేను జాతకం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే..? నేను ఇంతకు ముందు సమంత, నాగచైతన్య జాతకాన్ని చెప్పున్నాను కాబట్టి దానికి కొనసాగింపుగా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్పా, నేను మాట మీదనే ఉంటాను. నేను ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనని, మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటాను. ఇక ఇప్పుడే మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు జాతకాలు చెబుతున్నారంటూ ప్రశ్నించాడు. నేను వారికి కూడా వివరించాను. సోషల్ మీడియాలో కూడా వేరేవారి జాతకాలను విశ్లేషించే ఉద్ధేశ్యం నాకు లేదు. విష్ణు కూడా కలుద్దామని అన్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు నా నుంచి ఆశించొద్దు. నేను చెప్పను” అని పేర్కొన్నారు వేణు స్వామి.

మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మంచు విష్ణు.. సినిమా పరిశ్రమలోని వారికి ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా నిలబడటంతో పాటు మద్దతునిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో కొంత మంది సినీ సెలబ్రిటీలను ముఖ్యంగా మహిళల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడంతో అటువంటి ఛానల్స్ పై యూట్యూబ్ సంస్థతో మాట్లాడి బ్యాన్ చేయించిన సంగతి విదితమే. ఇప్పుడు ఇలా తమ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి జ్యోతిష్యం చెప్పడం పట్ల కూడా ఆయన స్పందించాడు. తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఇండస్ట్రీకి అండగా నిలబడుతున్నాడు విష్ణు. ఇలా.. మా అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ అంతా కలిసి ఒక్కసారిగా వేణు స్వామి విషయంలో కలిసి రావడంతో ఆయన చిక్కుల్లో పడటం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetovis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş