iDreamPost
android-app
ios-app

కన్నప్ప సినిమాపై వచ్చే ఈ-మెయిల్స్.. మంచు విష్ణు టీమ్ క్లారిటీ!

  • Published Jul 27, 2024 | 10:31 AM Updated Updated Jul 27, 2024 | 10:31 AM

Manchu Vishnu: ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో నిజా నిజాలపై తర్వాత సెలబ్రెటీలు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నిత్యం జరుగుతున్న తంతే.

Manchu Vishnu: ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో నిజా నిజాలపై తర్వాత సెలబ్రెటీలు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది నిత్యం జరుగుతున్న తంతే.

  • Published Jul 27, 2024 | 10:31 AMUpdated Jul 27, 2024 | 10:31 AM
కన్నప్ప సినిమాపై వచ్చే ఈ-మెయిల్స్.. మంచు విష్ణు టీమ్ క్లారిటీ!

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. తన గంభీరమై స్వరంతో డైలాగ్స్ కొడుతుంటే థియేటర్లో ప్రేక్షకులు విజిల్స్, చప్పట్లు కొట్టేవారు.మంచు మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లు ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టకపోయినా.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇద్దరు హీరోలు. ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల సినీ సెలబ్రెటీలపై తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు టెర్మినేట్ అయ్యేలా ‘మా’ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుంది.. ఈ విషయంపై రచ్చ మొదలైంది. తాజాగా ఇప్పుడు ఈ-మెయిల్స్ వివాదం తెరపైకి వచ్చింది. మంచు కుటుంబానికి చెందిన 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పేరుతో కొంతమందికి ఈ మెయిల్స్ వెళ్లాయని.. అందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మంచు విష్ణు టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

ఈ మధ్య కన్నప్ప మూవీ గురించి పాజిటీవ్ వీడియోలు క్రియేట్ చేసి పంపాలని, అలాంటి యూట్యూబ్ ఛానెల్ పై బ్యాన్ తొలగేలా చేస్తామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో కొన్ని ఈ -మెయిల్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దీంతో మంచు విష్ణుపై విమర్శలు వస్తున్నాయి. అయితే.. అలాంటి మెయిల్స్ తాము చేయలేదని.. అవన్నీ ఫేక్ మెయిల్స్ అని మంచు విష్ణు టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమ పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ పంపుతున్న వారిపై చర్యలు తీసుకునేలా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంచు విష్ణు టీమ్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ‘ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఆ మెయిల్స్ మేం పంపలేదు.. మాకు సంబంధం లేదు. వాటిని ఎవరూ పట్టించుకోవొద్దని కోరుతున్నాం. మా సంస్థ పేరుతో ఫేక్ మెయిల్స్ పంపుతున్నవారిని గుర్తించేందుకు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అంటూ మంచు విష్ణు టీం పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by 24 Frames Factory (@24framesfactory)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss