iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కోరిక తీరుస్తున్న మంచు విష్ణు! కానీ.. పెద్ద ప్లానే ఇది!

  • Author Soma Sekhar Updated - 06:15 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Updated - 06:15 PM, Fri - 18 August 23
ప్రభాస్ కోరిక తీరుస్తున్న మంచు విష్ణు! కానీ.. పెద్ద ప్లానే ఇది!

ఇండస్ట్రీలో ప్రతీ హీరోకు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ కలల సినిమాను తన కెరీర్ ముగిసేలోపు కంప్లీట్ చేయాలని చూస్తుంటారు హీరోలు. అయితే కొంత మంది హీరోలకు ఆ ప్రాజెక్ట్ లు తెరకెక్కించడంలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వచ్చింది. ప్రభాస్ కు తన పెదనాన్న కృష్ణం రాజు నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ ను తీయాలని కోరిక. అయితే ఆదిపురుష్ ఎఫెక్ట్ తో ఆ తరహా కథలను ప్రస్తుత పరిస్థితులలో ప్రభాస్ చెయ్యడం కాస్త కష్టమనే అంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ప్రభాస్ కోరికను తీరుస్తున్నాడు మంచు విష్ణు. భారీ బడ్జెట్ తో భక్త కన్నప్ప సినిమా తెరకెక్కిస్తున్నాడు విష్ణు.

మంచు విష్ణు.. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఓ వైపు ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనులు నిర్వహిస్తూనే.. సినిమాలు చేస్తున్నాడు. జిన్నా సినిమా తర్వాత ఏ సినిమాను ప్రకటించలేదు విష్ణు. కానీ కొంతకాలం నుంచి భక్త కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తాను అంటూ గట్టిగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఎలాంటి హడావిడి లేకుండా ‘కన్నప్ప’ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మంచు వారి అబ్బాయి. ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ప్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఇటీవలే శ్రీకాళహస్తిలో ఎలాంటి హడావిడిలేకుండా పూజా కార్యక్రమంతో సినిమాను ప్రారంభించారు చిత్ర యూనిట్. ఈ మూవీని దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన మహాభారతం సిరీస్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్.. కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణుకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ నటిస్తోంది. సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్రా, తోట ప్రసాద్ లు ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. ఇక ఈ మూవీ మెుత్తాన్ని న్యూజిలాండ్ లో తెరకెక్కిస్తామని, తరతరాలు గుర్తు పెట్టుకునేలా భక్త కన్నప్పను నిర్మిస్తామని మోహన్ బాబు పేర్కొన్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ తెరకెక్కనుంది.

అయితే పెదనాన్న నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ అయిన భక్త కన్నప్పను తెరకెక్కించాలని కలలు కన్నాడు ప్రభాస్. ఎప్పటికైనా ఈ సినిమా చేస్తానని ఒకనొక సందర్భంలో చెప్పాడు డార్లింగ్. కానీ రోజులు మారే కొద్ది పరిస్థితులు మారాయి.. ప్రేక్షకుల అభిరుచులు మారాయి. అదీకాక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడంతో.. భక్త కన్నప్ప చేసే అవకశాం కూడా లేదు. పైగా ఆదిపురుష్ ఎఫెక్ట్ ఉండనే ఉంది అంటున్నారు నెటిజనులు. ఈ క్రమంలోనే ప్రభాస్ కోరికను తీరుస్తున్నాడు మంచు విష్ణు.

Manchu vishnu doing bhaktha kannappa for prabhas

దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ సినిమాను మళ్లీ తెరకెక్కించాలను కోవడం సాహసం అనే చెప్పాలి. పైగా 150 కోట్ల బడ్జెట్ అంటున్నారు. మంచు విష్ణు మార్కెట్ కు ఇది పెద్ద బడ్జెట్.. అయినప్పటికీ ఆయన సాహసం మెచ్చుకోవాల్సిందే. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను తీసుకొచ్చి సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసి.. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాలని విష్ణు పెద్ద ప్లానే వేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి డార్లింగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తూ.. అతడి కోరిక తీరుస్తున్న మంచు విష్ణుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సినిమా విడుదల కాలేదని..గుండెపోటుకు గురైన నిర్మాత..!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş