ఆ విషయంలో NTRను దాటేసిన మంచు విష్ణు.. ఇది మామూలు ఫీట్ కాదు!

Manchu Vishnu: డిఫరెంట్ మూవీస్​తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటారు హీరో మంచు విష్ణు. త్వరలో ‘కన్నప్ప’గా అభిమానుల ముందుకు రానున్నారు.

Manchu Vishnu: డిఫరెంట్ మూవీస్​తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటారు హీరో మంచు విష్ణు. త్వరలో ‘కన్నప్ప’గా అభిమానుల ముందుకు రానున్నారు.

డిఫరెంట్ మూవీస్​తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తుంటారు మంచు విష్ణు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతుంటారాయన. ఆ మధ్య మూవీస్ చేయడం తగ్గించిన విష్ణు.. మళ్లీ జోరు పెంచారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రంతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ కోసం ఆడియెన్స్ ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నాయి. విజువల్స్ రిచ్​గా ఉండటం, గ్రాఫిక్స్ కూడా బాగుండటంతో ‘కన్నప్ప’పై ఎక్స్​పెక్టేషన్స్​ పెరుగుతున్నాయి. విష్ణుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్​లాల్‌ లాంటి బిగ్ స్టార్స్ నటించడంతో ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయని అంటున్నారు.

సినిమాల సంగతి పక్కనబెడితే మంచు విష్ణు ఇప్పుడు ఓ విషయంతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​లో ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​ను అధిగమించారు. ఇన్​స్టాలో తారక్​కు 7.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ విష్ణుకు ఏకంగా 8 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం. ఇన్​స్టాలో విష్ణు చాలా యాక్టివ్​గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు పర్సనల్ లైఫ్​లోని స్పెషాలిటీస్ గురించి కూడా ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ టచ్​లో ఉంటారు. అందుకే ఆయన ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

మంచు విష్ణుకు ఇన్​స్టా భారీగా ఫాలోవర్లు ఉన్నా తారక్​ను అధిగమించడం కష్టమేనని అనుకున్నారు. కానీ ఆయన ఎన్టీఆర్​ను ఈ విషయంలో మించిపోయారు. ఇది తెలిసిన నెటిజన్స్.. నెక్స్ట్ లెవల్ ఫీట్ అంటూ ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ఇక, సినిమాలతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్​గా తన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తున్న విష్ణు.. ఇటీవల కాంట్రవర్సీగా మారిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇష్యూ మీద కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. తెలుగు వాళ్లు చాలా మర్యాదస్తులని, పద్ధతిగా ఉంటారని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియా యాప్స్​లో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల తెలుగు వాళ్లు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారనే ప్రశ్న ఎదురవుతోందని చెప్పారు. హీరోయిన్స్​ లేదా ఇతర సినీ ప్రముఖుల మీద ట్రోలింగ్ వీడియోస్ చేసేవారు 48 గంటల్లో వాటిని తొలగించాలని లేదా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరి.. ఇన్​స్టా ఫాలోవర్స్ విషయంలో తారక్​ను విష్ణు అధిగమించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments